యాప్నగరం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా పాజిటివ్... ఫామ్‌హౌస్‌లో చికిత్స

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కోవిడ్ పాజిటివ్ వచ్చనట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఫామ్‌హౌస్‌లో ఐసోలేషన్‌లో ఉన్నట్లు సీఎస్ పేరిట ప్రెస్ నోట్ విడుదలైంది.

Samayam Telugu 20 Apr 2021, 3:29 pm

ప్రధానాంశాలు:

  • తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్
  • స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న కేసీఆర్
  • ఫామ్ హౌస్‌లో ఐసోలేషన్‌లో చికిత్స
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu కేసీఆర్
తెలంగాణలో కరోనా మహమ్మారి చెలరేగిపోతోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా వైరస్ సోకింది. ఆయనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని చీఫ్ సెక్రటరీ సోమవారం ప్రెస్‌ నోట్ రిలీజ్ చేశారు. కేసీఆర్ స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారని, వైద్యుల సూచన మేరకు ఫామ్‌హౌస్‌లో ఐసోలేషన్‌లో ఉన్నారని సీఎస్ పేర్కొన్నారు. కేసీఆర్‌కు జలుబు మాత్రమే ఉందని.. జ్వరం తగ్గిందని కేసీఆర్ వ్యక్తిగత డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. సీఎం ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన హాస్పిటల్లో చేరాల్సిన అవసరం లేదన్నారు.


నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఈ నెల 14న హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన నోముల భగత్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. భగత్‌‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ నేత కోటి రెడ్డికి కరోనా సోకింది. నోముల భగత్, కోటిరెడ్డి ఇద్దరూ.. హాలియా బహిరంగ సభలో కేసీఆర్‌తో కలిసి సభా వేదికను పంచుకున్నారు. కోటిరెడ్డి కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌ కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. మరోవైపు నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న పలువురు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు సైతం కోవిడ్ బారిన పడినట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.