యాప్నగరం

టీకాంగ్రెస్‌‌కు బిగ్ షాక్ .. గుడ్‌బై చెప్పేసిన కీలక నేతలు

తెలంగాణ కాంగ్రెస్ మరో భారీ షాక్ తగిలింది. నగరంలో కీలక నేత కాషాయ దళంలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మరో ఇన్‌చార్జి కూడా బీజేపీలో చేరనున్నారు.

Samayam Telugu 22 Feb 2021, 9:56 pm
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. నిన్న కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. ఆయన బాటలోనే మరో ఇద్దరు కీలక నేతలు కూడా కమల తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయిపోయారు. నగరానికి చెందిన మరో కీలక నేత మహ్మద్ ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమయ్యారు. ఆయన ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో సమావేశమైనట్లు సమాచారం. రేపోమాపో ఆయన బీజేపీ గూటికి చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
congress


congress leaders



అలాగే కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న పాల్వాయి హరీశ్ బాబు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. రేపు తన అనుచరులతో కలసి బీజేపీలో చేరనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 1989 నుంచి పాల్వాయి కుటుంబం క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతోంది.

1989లో హరీష్ తండ్రి పాల్వాయి పురుషోత్తంరావు ఇండిపెండెంట్ అభ్యర్థిగా సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లోనూ ఆయన ఇండిపెండెంట్‌గానే విజయం సాధించారు. అనంతరం 1999లో ఆయన తల్లి పాల్వాయి రాజ్యలక్ష్మి టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత 2018 ఎన్నికల్లో హరీష్ బాబు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే కోనప్ప చేతిలో ఓటమి చెందారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.