యాప్నగరం

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ ఇదే..

తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 19 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Samayam Telugu 15 Feb 2020, 11:50 pm
తెలంగాణ ఎంసెట్‌ తేదీలు ఖరారయ్యాయి. మే 4, 5, 6వ తేదీల్లో ఇంజినీరింగ్‌; మే 9, 11వ తేదీల్లో అగ్రికల్చర్ మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 19న ఎంసెట్ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్ధన్‌ శనివారం (ఫిబ్రవరి 15) సాయంత్రం ఎంసెట్ షెడ్యూల్‌ విడుదల చేశారు. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 30 వరకు ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
Samayam Telugu exam


రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 6వ తేదీ వరకు, రూ.1000 ఫైన్‌తో ఏప్రిల్‌ 13వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. రూ.5 వేల ఫైన్‌తో ఏప్రిల్‌ 20 తేదీ వరకు, రూ.10 వేల జరిమానాతో ఏప్రిల్‌ 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 3 వరకు సవరణలకు అవకాశం కల్పిస్తారు. ఏప్రిల్‌ 20 నుంచి మే 1 వరకు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.