యాప్నగరం

తెలంగాణ ESI స్కాంలో కొత్త కోణాలు.. మరోసారి ఏసీబీ దాడులు

ఈఎస్ఐ స్కాంలో ఏసీబీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. తాజాగా భారీగా నగదును కూడా సీజ్ చేశారు. ఇప్పుడు దేవికరాణి పదికోట్ల విలువ చేసే ఆభరణాలపై అధికారులు ఫోకస్ పెట్టారు.

Samayam Telugu 2 Sep 2020, 1:47 pm
తెలంగాణలో సంచలనం రేపిన ఈఎస్ఐ స్కాంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. రూ.10 కోట్ల ఆభరణాలను దేవికారాణి మాయం చేసినట్లు తెలుస్తోంది. దీంతో బంగారు ఆభరణాలపై ప్రత్యేక బృందంతో విచారణ చేపట్టారు. అరెస్టైన ఈఎస్ఐ మాజీ డైరెక్టర్‌ దేవీకారాణి అక్రమాలపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే భారీ మొత్తంలో ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పదవిని అడ్డం పెట్టుకొని భారీగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినట్లు తేల్చారు. రూ.10 కోట్ల మేరకు ఆభరణాల ఆచూకీ గల్లంతైనట్లు అధికారుల విచారణలో వెలుగు చూసింది.
Samayam Telugu తెలంగాణ ఈఎస్ఐ స్కాం
telangana esi scam


ఇప్పటికీ ఏసీబీకి రూ. 10 కోట్ల ఆభరణాలు ఎక్కడ ఉన్నాయన్న ఆచూకీ దొరకలేదు. ఆభరణాలపై కుటుంబ సభ్యులు, భర్తను అధికారులు ప్రశ్నిస్తున్నారు. కమర్షియల్‌ ఫ్లాట్‌కోసం రూ.3.37 కోట్లు బిల్డర్‌కి దేవీకారాణి ఇచ్చినట్లు తేలింది. దీంతో బిల్డర్‌ దగ్గర నుంచి రూ.4.47 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. దేవీకారాణి పెట్టుబడుటు, ఆభరణాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం దృష్టి సారించింది. పక్కరాష్ట్రాల్లో కూడా పెద్ద మొత్తంలో దేవీకారాణి పెట్టుబడులు పెట్టినల్లు అధికారులు అనుమానిస్తున్నారు.

Read More: కరోనాతో మరణిస్తే రూ. 25 లక్షలు.. వైద్య సిబ్బందికి సర్కారు సాయం

ఈఎస్ఐ స్కాం కేసులు ఏసీబీ దూకుడు పెంచింది.. డైరెక్టర్ దేవికారాణి, ఫార్మాసిస్ట్ నాగల‌క్ష్మిపై మరో కేసు న‌మోదైంది.. ఆదాయానికి మించిన ఆస్తులపై కేసు నమోదు చేసిన ఏసీబీ.. మాజీ డైరెక్టర్ దేవికారాణి, ఫార్మసిస్ట్ నాగలక్ష్మికి చెందిన రూ.4.47 కోట్లను సీజ్ చేసింది. ఈ మొత్తంలో దేవికారాణిది రూ.3.37 కోట్లు కాగా, మిగ‌తా మొత్తం నాగ‌ల‌క్ష్మి చెందిన క్యాష్‌గా చెబుతున్నారు. బెయిల్‌పై బయటకు వచ్చాక బిల్డర్‌ దగ్గర దేవికారాణి డబ్బు దాచారు. ఈఎస్‌ఐ డైరెక్టర్‌గా ఉండగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.