యాప్నగరం

గన్‌పార్క్ అమరుల స్థూపం వద్ద కేసీఆర్ నివాళులు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ గన్ పార్క్ వద్దనున్న అమరుల స్థూపానికి నివాళులు అర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు.

Samayam Telugu 2 Jun 2020, 9:03 am
తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు నిరాండంబరంగా జరుగుతున్నాయి. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. ప్రగతి భవన్‌ నుంచి గన్‌పార్క్‌ చేరుకున్న ఆయన అమర వీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా తెలంగాణ కోసం అమరులైన వారి త్యాగాలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. అనంతరం ప్రగతి భవన్లో సీఎం జెండా ఎగరేస్తారు.
Samayam Telugu ఫైల్ ఫొటో
kcr at gunpark


తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేత కే కేశవరావు జాతీయ జెండా ఎగురవేశారు. బీఆర్కే భవన్‌లో తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ జెండా ఎగరేశారు. సరూర్‌నగర్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి అమరులకు నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.