యాప్నగరం

ఎమ్మెల్సీ ఎన్నికలకు నో.. కేసీఆర్ సర్కార్ షాకింగ్ డెసిషన్

గత జూన్‌ 3తో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం విముఖత చూపింది. అందుకు ఇది అనువైన సమయం కాదని.. ఎన్నికలు నిర్వహించలేమని లేఖ రాసింది.

Samayam Telugu 31 Jul 2021, 8:45 pm
ఎన్నికల సమరానికి కేసీఆర్ సర్కార్ నో చెప్పింది. ఇప్పుడు ఎన్నికలు జరిపేందుకు అనువైన సమయం కాదని.. ఎన్నికలు నిర్వహించలేమని తేల్చిచెప్పేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఇటీవల ఖాళీ అయిన శాసన సభ కోటా ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. సభ్యుల పదవీ కాలం ముగిసే నాటికి ఎన్నికల నిర్వహణ ఎన్నికల కమిషన్ పూర్తి చేసేది. కోవిడ్ విజృంభణతో కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
mlc election


ప్రస్తుతం లాక్‌డౌన్ నిబంధనలు సడలించడం.. అన్ని కార్యక్రమాలు సాఫీగా జరుగుతుండడంతో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం కోరింది. అందుకు స్పందించిన కేసీఆర్ సర్కార్ ఇప్పుడు ఎన్నికలు జరపలేమని తెలిపింది. రోజుకి 600కి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయని.. ఎన్నికల నిర్వహణకు అనువైన సమయం కాదని ఈసీకి లేఖ రాసింది. మొత్తం ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.

అయితే ప్రభుత్వ నిర్ణయంతో నేతల ఆశలకు గండిపడినట్లు తెలుస్తోంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టిక్కెట్ ఆశించి భంగపడిన కోటి రెడ్డి, ఇటీవల టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎల్ రమణకి ఎమ్మెల్సీ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అలాగే గతంలో ఎమ్మెల్సీ, మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితర కీలక నేతలు ఎమ్మెల్సీపై ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ నిర్ణయంతో ప్రస్తుతానికి పదవుల పందేరం లేనట్టే!!

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.