యాప్నగరం

ఇక టీచర్లకు తిప్పలే.. ప్రభుత్వం కొత్త విధానం

ప్రైమరీ పాఠశాలల్లో ఎక్కువగా అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తించారు. హాజరులో తప్పులు జరగకుండా ఈ కొత్త విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని యోచిస్తున్నారు. ఏపీలో ఈ విధానం విజయవంతంగా అమలవుతోంది.

Samayam Telugu 22 Dec 2019, 9:14 am
వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు తిప్పలు తప్పేలా లేవు. ఎందుకంటే స్కూళ్లలో వారికి కూడా బయోమెట్రిక్ హాజరును అమల్లోకి తీసుకురానున్నారు. అయితే, ప్రస్తుతం ఈ విధానం 12 జిల్లాల్లో విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయులకు అమలు చేస్తున్నారు. గతంతో పోలిస్తే వీరి అటెండెన్స్ చక్కగా పెరగడంతో ఇదే విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో వాడాలని ఉన్నతాధికారులు ప్రణాళికలు వేస్తున్నారు.
Samayam Telugu Governmment School Telangana


Also Read: Disha Case: నిందితుల మృతదేహాలకు రీపోస్ట్‌మార్టం.. 50 శాతం కుళ్లిన స్థితిలో..

అన్నీ అనుకున్నట్టు జరిగితే 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఉపాధ్యాయులకు బయోమెట్రిక్‌ హాజరు విధానం అమల్లోకి రానుంది. మరి ఒకేసారి అంత పెద్ద మొత్తంలో బయోమెట్రిక్‌ యంత్రాలు సమకూర్చడం కూడా అంత సులభం కాదు. అందుకని కొత్త ప్రణాళిక వేశారు. ఇప్పుడు 12 జిల్లాల్లో ఉన్న బయోమెట్రిక్‌ను విద్యార్థులకు తొలగించి, ఆ మిషన్లను రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల కోసం వాడాలని భావిస్తున్నారు. తర్వాత నెమ్మదిగా విద్యార్థులకూ అందుబాటులోకి తీసుకొస్తారు. దీనిపై త్వరలో అధికారులు సమావేశమై చర్చించనున్నారు. రాష్ట్రంలో సమారు 26 వేల ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ పాఠశాలలు ఉన్న సంగతి తెలిసిందే.

Also Read: వీడియో :రోడ్లపై ఇలా మాత్రం చేయకండి.. రాచకొండ సీపీ ట్వీట్

ప్రైమరీ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు విషయంలో అనేక అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. పరస్పర అవగాహనతో కొందరు టీచర్లు వంతుల వారీగా సెలవులు పెడుతున్నట్లు తెలుస్తోంది. టీచర్‌ సెలవులో ఉన్నప్పటికీ హాజరు రిజిస్టర్‌లో మాత్రం సెలవు నమోదు చేయడంలేదు. ఇది మ్యాన్యువల్‌గా సంతకం చేసే విధానం కాబట్టి తప్పు జరిగిపోతోంది. పొరుగు రాష్ట్రం ఏపీలో టీచర్లకు బయోమెట్రిక్ విధానం రెండేళ్ల నుంచి విజయవంతంగా అమలు చేస్తున్నారు.

Also Read: AP Capital: లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ కీలక వ్యాఖ్యలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.