యాప్నగరం

బాపూ ఘాట్ వద్ద గవర్నర్, సీఎం కేసీఆర్ నివాళులు

Langer House: జనవరి 30 గాంధీ వర్ధంతి సందర్భంగా బాపుఘాట్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాపుఘాట్‌లో ప్రార్థనలు చేశారు.

Samayam Telugu 30 Jan 2020, 1:15 pm
జాతిపిత మహాత్మాగాంధీ 72వ వర్ధంతి సందర్భంగా మహాత్ముడిని సీఎం కేసీఆర్‌ స్మరించుకున్నారు. సత్యం, అహింస సిద్ధాంతాల ద్వారా ప్రపంచానికి శాంతి సందేశం అందించిన ఆయన మార్గం ఎల్లప్పుడూ ఆచరణీయమని కొనియాడారు. ఎంతటి కష్టతరమైన లక్ష్యాన్నైనా సత్యాగ్రహ దీక్షతో సాధించొచ్చని గాంధీజీ నిరూపించారని అన్నారు. ఎన్నో సమస్యలకు గాంధీ సందేశం పరిష్కారం చూపిందని కేసీఆర్ అన్నారు.
Samayam Telugu Bapu_Ghat langer house


Also Read: ఖమ్మంలో ఉద్రిక్తతలు.. రైతుల మూకుమ్మడి ఆందోళన

జనవరి 30 గాంధీ వర్ధంతి సందర్భంగా బాపుఘాట్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాపుఘాట్‌లో ప్రార్థనలు చేశారు. అంతకుముందు గవర్నర్ సికింద్రాబాద్ మెట్టుగూడలో అయ్యప్ప భక్త సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన కుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also Read: ఇక ఆ ఆర్టీసీ బస్సులన్నింటిపై కేసీఆర్ బొమ్మలు: మంత్రి

గాంధీ వర్థంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ ‌వద్ద రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, సోనియా గాంధీ, బీజేపీ సీనియర్‌ ‌నేత ఎల్‌కే అడ్వాణీ, సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌, త్రివిధ దళాధిపతులు తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతిపిత సేవలు, ఆశయాలను స్మరించుకుంటున్నారు.


Also Read: మహిళలూ వేధింపులా? షీటీమ్స్ నుంచి కొత్త నెంబర్‌, ఎలా వాడాలంటే..

Also Read: అవాస్తవాలు ప్రచారం చేయొద్దు. నిజాలివీ.. కరోనా వైరస్‌పై మంత్రి ఈటల

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.