యాప్నగరం

పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై

పవన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ, సీని ప్రముఖులంతా పవన్‌కు సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ చెబుతున్నారు.

Samayam Telugu 2 Sep 2020, 9:19 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇవాళ తన పుట్టినరోజు వేడుకల్ని జరుపుకుంటున్నారు. ఈ రోజు ఆయన 50వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా పవన్‌కు అభిమానులు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా జనసేనానికి అందరూ విషెస్ చెబుతున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా తన ట్విట్టర్ ద్వారా పవన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘జన్మదిన శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎప్పుడు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని,జీవితంలో మరెన్నో విజయాలు సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని తమిళిసై ట్వీట్‌లో చేశారు.
Samayam Telugu పవన్‌కు గవర్నర్ విషెస్
pawan governor tamilisai


మరోవైపు పవన్ బర్త్ డే సందర్భంగా పవన్ బర్త్‌డే సందర్భంగా 9.09ని.లకి వకీల్ సాబ్ నుండి సర్‌ప్రైజ్ రానుంది. అలానే పవన్ 27 వ సినిమా అప్‌డేట్ మధ్యాహ్నాం 12.30ని.లకి, అలానే పవన్ కళ్యాణ్ 28వ చిత్రం అప్ డేట్ సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రానుంది. పవన్ జన్మదిన వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. ఫ్లెక్సీ కడుతూ ముగ్గురు జనసైనికులు, పవన్ ఫ్యాన్స్‌ విద్యుత్ షాక్‌కు గురై చనిపోయారు. ఈ ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బ ాధిత కుటుంబాలకు అండగా ఉంటానన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.