యాప్నగరం

గవర్నర్ తమిళిసై ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రముఖుల సంతాపం

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తల్లి కృష్ణ కుమారి కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె సోమాజీగూడలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు

Samayam Telugu 18 Aug 2021, 9:19 am
తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మాతృమూర్తి కృష్ణకుమారి(80) బుధవారం ఉదయం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె సోమవారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు సోమాజీగూడ యశోదా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్లు ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. తల్లి పరిస్థితిపై గవర్నర్‌ తమిళిసై మంగళవారం ఆస్పత్రికి వెళ్లి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
Samayam Telugu తల్లిలో గవర్నర్ తమిళిసై(File Photo)


అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కృష్ణకుమారి బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో గవర్నర్ కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. కృష్ణకుమారి పార్థివదేహాన్ని సందర్శకుల కోసం ఈ రోజు మధ్యాహ్నం వరకు రాజ్‌భవన్‌లో ఉంచనున్నారు. అనంతరం అంత్యక్రియల కోసం చెన్నైకి తరలిస్తారు. ఈరోజు ఉదయం తన ప్రియమైన తల్లిని కోల్పోయానంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్వీట్ చేశారు. అంత్యక్రియల నిమిత్తం పార్థివదేేహాన్ని చెన్నైలోని సాలిగ్రామానికి తరలించనున్నట్లు వెల్లడించారు.

కృష్ణకుమారి మాజీ ఎంపీ కుమారినందన్‌ భార్య. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ఆమెకు పెద్ద కూతురు. తమిళిసై సౌందరరాజన్ మాతృమూర్తి కృష్ణ కుమారి మరణం పట్ల స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, మంత్రి హరీశ్‌రావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.