యాప్నగరం

తెలంగాణలో కరోనా చికిత్స.. గవర్నర్ ఆసక్తికర ట్వీట్

తెలంగాణలో కరోనా వైరస్ చికిత్స, టెస్టింగ్‌పై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ హాస్పిటళ్లు పేదలకు ఆశాదీపంగా మారాయన్నారు.

Samayam Telugu 15 Jul 2020, 10:07 am
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సమయంలో.. అందుతున్న చికిత్స, తీసుకుంటున్న చర్యలపై గవర్నర్ తమిళిసై ట్వీట్లు చేశారు. పేదలకు ప్రభుత్వ హాస్పిటళ్లు ఆశాదీపంగా నిలుస్తున్నాయని ఆమె కొనియాడారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో చికిత్స బాగుందని, పరిశుభ్రతను పెంపొందించారని ఆమె తెలిపారు. సర్కారీ దావఖానాల్లో చికిత్స చేయించుకునేలా ప్రజలకు భరోసానిస్తాయన్నారు.
Samayam Telugu తెలంగాణ గవర్నర్


జిల్లా హాస్పిటళ్లు, టిమ్స్, ప్రయివేట్ మెడికల్ కాలేజీల్లో కరోనా చికిత్స అందిస్తున్నారని గవర్నర్ తెలిపారు. ర్యాపిడ్ టెస్టులను పెంచామని.. 98 డయాగ్నొస్టిక్ ల్యాబుల్లో టెస్టులు చేస్తున్నారని గవర్నర్ ట్వీట్ చేశారు. హాస్పిటళ్లలో బెడ్ల ఖాళీల వివరాలను డ్యాష్ బోర్డులో పొందుపరుస్తున్నారని.. హోం క్వారంటైన్లో ఉంటున్న వారికి కాల్ సెంటర్ల ద్వారా సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గవర్నర్ తెలిపారు.

కరోనా వైరస్ పరిస్థితులపై గతంలో సీఎస్, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించేందుకు గవర్నర్ ప్రయత్నించారు. వీలుపడక పోవడంతో.. ప్రయివేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ చర్చలు జరిపారు. అందరికీ వైద్యం అందించాలని సలహా ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.