యాప్నగరం

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సీఎం కీలక హామీ.. ఎన్నికల కోడ్ ముగియగానే ప్రకటన

ఉద్యోగులకు తెలంగాణ సర్కారు పరోక్షంగా గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ప్రకటన చేయకపోయినప్పటికీ.. ఉద్యోగ సంఘాల నేతలు కీలక విషయాలను వెల్లడించారు.

Samayam Telugu 9 Mar 2021, 8:27 pm
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. బీఆర్కే భవన్‌లో తనను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలకు కేసీఆర్ కీలక హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పీఆర్సీ ప్రకటన ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు. ఏపీలో జగన్ సర్కారు 27 శాతం పీఆర్సీ ఇచ్చిందని చెప్పగా.. అంతకంటే ఎక్కువే ఇస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారని ఉద్యోగ సంఘ నేతలు చెప్పారు.
Samayam Telugu KCR
Telangana chief minister K Chandrasekhar Rao


ఉద్యోగులకు 7.5 శాతం పీఆర్సీ ఇస్తారని గతంలో వార్తలు వెలువడ్డాయి. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందారు. 2018 జులై నుంచి పీఆర్సీ అమలు కావాల్సి ఉందని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయమై స్పందించిన సీఎం.. తమ ప్రభుత్వం ఉద్యోగులకు అన్యాయం చేయబోదన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ పెంపు విషయంలో సీఎం హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు.

ఎన్నికల నోటిఫికేషన్ అమల్లో ఉండటంతోనే సీఎం ప్రకటన చేయడం లేదని.. కానీ రాష్ట్రంలోని ఉద్యోగులు ఆందోళనలో ఉండటంతో తాము ఈ విషయాలను వెల్లడిస్తున్నామని సీఎంతో సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.