యాప్నగరం

ఆ ప్లాట్లు కొన్నవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్

రాష్ట్రంలో అనధికార లే అవుట్లు, అక్రమ నిర్మాణాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రభుత్వం యోచించింది. లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ సౌకర్యం కల్పించడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఊరట లభించినట్లయింది.

Samayam Telugu 1 Sep 2020, 5:58 pm
అక్రమ లేవుట్‌లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి తెలంగాణ ప్రభుత్వం ఊరటనిచ్చే వార్త చెప్పింది. మరోసారి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం జీవో నెంబర్ 131ను విడుదల చేసింది. కొద్ది రోజుల క్రితం అక్రమ లే అవుట్లలోని ప్లాట్ల అక్రమ నిర్మాణాలకు తెలంగాణ సర్కార్ రిజిస్ట్రేషన్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ సౌకర్యం కల్పించడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఊరట లభించినట్లయింది. రాష్ట్రంలో అనధికార లే అవుట్లు, అక్రమ నిర్మాణాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రభుత్వం యోచించింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
telangana govt issues go to regularise unapproved layouts


దీంతో రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఆ శాఖ ఆదేశాలు జారీ చేయడంతో ఈసారి ఎల్ఆర్ఎస్ ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. దీనివల్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా అక్రమ లే అవుట్లు, నిర్మాణాలు వెలుస్తూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలన్నా అది సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని చోట్ల కూల్చివేతలు చేపట్టినా ముందుకు సాగలేదు.

కూల్చివేత ప్రక్రియ ప్రారంభిస్తే.. పేదలు, మధ్యతరగతి వారే నష్టపోతారని ప్రభుత్వం భావించింది. వీటిని క్రమబద్దీకరిస్తే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు యజమానులకు ఊరట లభిస్తుందని భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.