యాప్నగరం

లాక్‌డౌన్ వేళ పబ్‌లు, బార్లకు సర్కారు కీలక ఆదేశాలు

Wine Shops in Telangana: కొద్ది రోజుల క్రితం వైన్ షాపులకు మినహాయింపు ఇచ్చినా బార్లు, పబ్బులకు మాత్రం అనుమతించలేదు. ఈ క్రమంలో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి అవి మూసే ఉన్నాయి. ఈ క్రమంలో బార్లు, పబ్బులకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Samayam Telugu 15 May 2020, 8:55 pm
లాక్ డౌన్‌ అమలవుతున్న వేళ ఇప్పటికే గత 50 రోజులుగా నిత్యావసరాలు మినహా అన్ని దుకాణాలు మూతపడి ఉన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం వైన్ షాపులకు మినహాయింపు ఇచ్చినా బార్లు, పబ్బులకు మాత్రం అనుమతించలేదు. ఈ క్రమంలో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి అవి మూసే ఉన్నాయి. ఈ క్రమంలో బార్లు, పబ్బులకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


Also Read: హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ నిర్మూలనకు కొత్త నిర్మాణాలు: తలసాని

ఇప్పటికే బార్లు, పబ్బులలో ఉన్న బీర్లు, ఇతర మద్యం స్టాక్‌ను వైన్‌ షాపులకు తరలించాలని తెలంగాణ ఆబ్కారీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో బార్లు, పబ్బుల్లో ఉండిపోయిన స్టాక్‌ను ఆదివారం నుంచి మద్యం దుకాణాలకు తరలించేందుకు అనుమతి ఇచ్చింది. మే 17 నుంచి మే 31 మధ్య తరలించుకోవాలని ఆదేశించింది. పెరిగిన ధరల ప్రకారమే బీర్లు, లిక్కర్ అమ్మకాలు జరపాలని నిర్దేశించింది. ఈ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎక్సైజ్ అధికారులు పర్యవేక్షించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.