యాప్నగరం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీకి సర్కార్ లేఖ

కొవిడ్ జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తామని ఎస్‌ఈసీకి అధికారులు తెలిపారు. ఈనెల 30న ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు లేవని లేఖలో ప్రభుత్వం పేర్కొంది.

Samayam Telugu 21 Apr 2021, 2:52 pm

ప్రధానాంశాలు:

  • కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ఎన్నికల నిర్వహణ
  • మున్సిపల్ ఎన్నికలు యథాతధం
  • ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు లేవు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ఎన్నికల సంఘానికి సర్కార్ లేఖ
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలంటూ హైకోర్టులో కొందరు నాయకులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను యథాతధంగా జరగనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 30న ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు లేవని ప్రభుత్వం వెల్లడించింది. కొవిడ్ జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తామని ఎస్‌ఈసీకి అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వానికి ఎస్‌ఈసీ లేఖ రాసింది.
ఈ నెల 30న వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఐదు మున్సిపాలిటీలకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. వరంగల్ , ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.

ఈ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 16 నుంచి 18 వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ జరిగింది. ఇక రేపటి నుంచి నామినేషన్ల ఉపసంహరణ జరగనుంది. ఏప్రిల్ 30 న పోలింగ్ జరగనుంది. మే 3న అంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజున మున్సిపాలిటీ, కార్పొరేషన్ల ఫలితాలు వెలువడనున్నాయి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.