యాప్నగరం

స్విగ్గీ, జొమాటోతో కూరగాయల హోం డెలివరీ.. ఎలాగంటే

Vegetables Home Delivery: ప్రస్తుతం నగరంలో 12 రైతు బజార్లు ఉన్నాయి. రోజు ఇక్కడికి ప్రజలు పోటెత్తుతుండడంతో రద్దీని నియంత్రించడం కష్టంగా మారుతోంది. ఇక్కడ సామాజిక దూరం ఏ మాత్రం సాధ్యం కావడం లేదు. ఉదయం వేళల్లో కొనుగోలు దారులు వందలాదిగా తరలివస్తున్నారు.

Samayam Telugu 29 Mar 2020, 8:49 am
రైతు బజార్లు, మార్కెట్ల వద్ద సామాజిక దూరం పాటించడం కష్టమవుతున్న నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ విస్తృత చర్యలు తీసుకుంటోంది. వినియోగదారులందరికీ కూరగాయలు అందేలా ఇప్పటికే సంచార రైతు బజార్లను ప్రారంభించింది. దీనికి తోడు ఉన్నతాధికారులు తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. నగరాల్లో యాప్ ద్వారా చేసే ఆన్‌లైన్‌ ఆర్డర్లపై ఆహారాన్ని ఇళ్లకు సరఫరా చేసే ప్రముఖ సంస్థలైన జొమాటో, స్విగ్గీలతో పాటు ఇలాంటి పలు సంస్థలను కూడా కూరగాయలను చేరవేయడంలో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. అంతేకాక, కాలనీల్లో ఉండే సూపర్‌ మార్కెట్లు సైతం సమీప ప్రాంతాల్లోని ఇళ్లకు సరకులు చేరవేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
Samayam Telugu swiggydelievry


ప్రస్తుతం నగరంలో 12 రైతు బజార్లు ఉన్నాయి. రోజు ఇక్కడికి ప్రజలు పోటెత్తుతుండడంతో రద్దీని నియంత్రించడం కష్టంగా మారుతోంది. ఇక్కడ సామాజిక దూరం ఏ మాత్రం సాధ్యం కావడం లేదు. ఉదయం వేళల్లో కొనుగోలు దారులు వందలాదిగా తరలివస్తున్నారు. దీంతో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఈ ప్రభావంతోనే నగరంలో మరిన్ని అమ్మక కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించినట్టు వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్ వెల్లడించారు. 177 వాహనాల ద్వారా 331 ప్రాంతాల్లో సంచార రైతుబజార్లను నగరంలో ఇప్పటికే ప్రారంభించామని గుర్తు చేశారు. మరోవైపు, వ్యాపారులు, దళారులు ప్రజల అవసరాలను సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Must Read: నేను చనిపోలేదు, ఆ ఆంటీని వలవేసి పట్టుకోలేదు.. కరోనా సోకిన డీఎస్పీ కుమారుడి వీడియో వైరల్

పారిశుద్ధ్యానికి నిధులు..
రైతు బజార్లతోపాటు, హోల్‌సేల్‌ మార్కెట్లలో పరిశుభ్రత కోసం రూ.27.9 లక్షలను మార్కెటింగ్‌ శాఖ కేటాయించింది. మరుగుదొడ్లు, క్యాంటిన్ల వద్ద శానిటైజర్లు, చేతులు శుభ్రం చేసుకునేందుకు హ్యాండ్ వాష్‌లను అందుబాటులో ఉంచేందుకు ఈ నిధులను ఖర్చు చేస్తున్నట్లుగా వెల్లడించారు. నిత్యావసర వస్తువుల సరఫరాలో, ధరల విషయంలో ఫిర్యాదులుంటే 100 నంబరుకు ఫోను చేసి ఫిర్యాదు చేయవచ్చునని అధికారులు చెప్పారు.

Must Read: వంట చేసి భార్యకు రుచి చూపించిన రేవంత్, నారా లోకేశ్ కరోనా టిప్స్

Also Read: సీపీ సజ్జనార్ ఇంట్లోకి పాము..

Also Read: కరోనా నివారణకు హైదరాబాద్ ప్రొఫెసర్ సంచలన ఆవిష్కరణ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.