యాప్నగరం

రైతుబంధు మార్గదర్శకాలు విడుదల.. మరో 10 రోజుల్లోనే..

Rythu Bandhu Scheme: రైతుబంధు కోసం ఏడాదిలో ఒకేసారి వివరాలను పరిశీలిస్తామని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఇందులో భాగంగా ప్రతిసీజన్‌కు ముందు భూముల లావాదేవీలను పరిశీలిస్తారు.

Samayam Telugu 16 Jun 2020, 7:17 pm
తెలంగాణలో రైతుబంధు సాయానికి విడుదలకు సంబంధించి ప్రభుత్వంమార్గదర్శకాలు విడుదల చేసింది. మరో పది రోజుల్లోనే ఈ రైతుబంధు నగదును లబ్ధదారులకు వారివారి ఖాతాల్లో వేసేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు సోమవారం ఆదేశాలు జారీచేశారు. దీనికి సంబంధించి మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Rythubandhu


ఈ ఏడాది లబ్ధిదారుడైన రైతుకు ఎకరానికి రూ.5 వేలు రైతుబంధు సాయం అందించనున్నారు. ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాదారులకు సైతం రైతుబంధు సాయం అందనుంది. అలాగే, పెద్దపల్లి జిల్లాలోని కాసుపల్లిలో దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న 621 మంది పట్టాదారులకు కూడా ప్రత్యేక పరిస్థితుల్లో సాయం అందిస్తామని ఉత్తర్వుల్లో ప్రత్యేకంగా వివరించారు.

Also Read: undefined

రైతుబంధు కోసం ఏడాదిలో ఒకేసారి వివరాలను పరిశీలిస్తామని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఇందులో భాగంగా ప్రతిసీజన్‌కు ముందు భూముల లావాదేవీలను పరిశీలిస్తారు. భూముల అమ్మకాలకు సంబంధించిన వివరాలను రైతుబంధు లిస్టు నుంచి తొలగిస్తారు. కొనుగోలు చేసిన వారి వివరాలతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాలకు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే రైతుబంధు అందిస్తారు. అయితే, రైతుబంధు సాయం విషయంలో దశలవారీగా నిధుల విడుదలవుతున్న నేపథ్యంలో తొలుత తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీంతో ముందుగా వీరి ఖాతాల్లో డబ్బు జమకానుంది.

Must Read: ఫోటోలు: కలెక్టర్లతో సీఎం కేసీఆర్ మీట్.. మోదీ స్టైల్‌లోనే మళ్లీ..

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.