యాప్నగరం

రైతులకు అలర్ట్.. రూ.1173 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం!

తెలంగాణ సర్కారు అన్నదాతల కుటుంబాలను ఆదుకోవడం కోసం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. రైతులెవరైనా చనిపోతే నామినీకి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తారు.

Samayam Telugu 11 Aug 2020, 10:40 am
రైతు బీమా పథకం అమలు కోసం తెలంగాణ సర్కారు నిధులను విడుదల చేసింది. రూ.1173.54 కోట్ల ప్రీమియం నిధులను విడుదల చేస్తూ... వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 18 శాతం జీఎస్టీతో కలిపి రూ.1141 కోట్ల ప్రీమియం, రూ.32.54 కోట్ల స్టాంప్ డ్యూటీని ప్రభుత్వ విడుదల చేసింది.
Samayam Telugu నమూనాచిత్రం


ఈ ఏడాది ఆగష్టు 14 నుంచి 2021 ఆగష్టు 13 వరకు రైతులకు ఈ బీమా సదుపాయం వర్తిస్తుంది. రూ.1174 కోట్ల ప్రీమియంను ఎల్ఐసీకి చెల్లిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 18-59 ఏళ్ల మధ్య వయసున్న రైతులందరికీ ఈ బీమా వర్తిస్తుంది. ఈ ఏడాది కొత్తగా 2 లక్షల మంది రైతులు ఈ బీమా పథకం పరిధిలోకి వస్తున్నారు.

ఏ కారణంగానైనా రైతు చనిపోతే.. వారం రోజుల వ్యవధిలోనే రూ.5 లక్షలను సంబంధీకుల బ్యాంకు ఖాతాలో జమ చేసేలా రైతు బీమా పథకాన్ని ఏర్పాటు చేశారు. 2018 ఆగష్టు 14న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభమైంది. గత రెండేళ్లలో 32,267 రైతు కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఎల్‌ఐసీ ద్వారా రూ.1613.35 కోట్లు రైతు కుటుంబాలకు పరిహారంగా అందింది.

ఇప్పటివరకు రైతు బీమాకు నమోదు చేసుకోని రైతులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. కొత్తగా పాసు పుస్తకాలు వచ్చిన వాళ్లు సైతం నమోదు చేసుకునేందుకు వ్యవసాయ శాఖ అనుమతిచ్చింది. బీమా నమోదు ఆప్షన్‌‌ను గత ఫిబ్రవరిలో తొలగించడంతో కొత్త పాస్‌ పుస్తకాలు వచ్చిన వారు రైతు బీమా కోసం నమోదు చేసుకోవడం కుదర్లేదు.

పట్టాదారు పాసు పుస్తకం ఉండి 18-59 ఏళ్ల మధ్య వయస్కులు బీమాకు అర్హులు. పాస్‌ పుస్తకం, ఆధార్‌ కార్డు, నామినీ ఆధార్‌ కార్డుతో దరఖాస్తు నింపి వ్యవసాయ శాఖ ఏఈవోలకు అందించాలి. ఏఈవోలు ఆ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.