యాప్నగరం

కరోనా ఎఫెక్ట్: కరీంనగర్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయాలు

Coronavirus in Karimnagar: కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా అధికారులకు ఫోన్ చేసి పరిస్థితిని సమీక్షించారు. అవసరం అయితే నిబంధనలను మరింత కఠినంగా చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Samayam Telugu 24 Mar 2020, 10:51 am
కరీంనగర్‌లో ఇండోనేసియా దేశస్థులకు కరోనా సోకడంతో నగరం మొత్తం భయాందోళనలు రేగుతున్న సంగతి తెలిసిందే. అంతేకాక, వారిని కలిసిన స్థానికుడికి కూడా కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో నగరంలో భయాందోళనలు మరింతగా పెరిగాయి. దీంతో కరీంనగర్ జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం.. జిల్లాలోని పలు ప్రాంతాలను రెడ్‌ జోన్ పరిధిలో చేర్చారు. ఇండోనేసియా దేశస్థులు సంచరించిన ముకరాంపుర, కశ్మీర్ గడ్డను రెడ్‌జోన్ ప్రాంతాలుగా ప్రకటించారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ శశాంక ఉత్తర్వులు జారీ చేశారు.
Samayam Telugu Karimnagar corona


Must Read: తెలంగాణకు గుడ్‌న్యూస్.. ఇక ఆ కరోనా పరీక్షలు సైతం ఇక్కడే..

ఇండోనేసియన్లు నగరంలో సంచరించిన ప్రాంతాల చుట్టూ బారీకేడ్లను ఏర్పాటు చేశారు. అంతేకాక, జిల్లాల సరిహద్దులను పూర్తిగా మూసివేశారు. కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్లే రహదారిపై ఆరు ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా అధికారులకు ఫోన్ చేసి పరిస్థితిని సమీక్షించారు. అవసరం అయితే నిబంధనలను మరింత కఠినంగా చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Must Read: కరోనా వైరస్‌పై దిమ్మ తిరిగే పుకార్లు! గ్రామాల్లో మరీ దారుణంగా.. ఇవి మాత్రం నమ్మకండి

కరీంనగర్‌లో ఇండోనేసియా బృందం తిరిగిన ప్రాంతాలను గుర్తించిన అధికారులు వారు దాదాపుగా 500 మంది వరకూ కలిసినట్టు గుర్తించారు. వారిని అందర్నీ ఐసోలేషన్‌లో ఉంచాలని నిర్ణయించారు. అంతేకాక, ఇండోనేసియన్లతో సన్నిహితంగా ఉండడంతో కరోనా సోకిన స్థానిక వ్యక్తితో దగ్గరగా ఉన్నవారు కూడా తమంత తామే కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వచ్చి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ ఓ ప్రకటనలో సూచించారు.

Must Read: కేసీఆర్‌కు విజయశాంతి మద్దతు.. కరోనాపై కీలక వ్యాఖ్యలు

Must Read: లాక్‌డౌన్: సిరిసిల్ల కలెక్టర్ తీవ్రస్థాయిలో ఫైర్.. రోడ్డుపైనే కార్లు, బైక్‌లు లాక్కొని..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.