యాప్నగరం

భారీగా తహశీల్దార్ల బదిలీలు.. విజయారెడ్డి ఉదంతమే కారణమా?

తమను బదిలీ చేయాలని తహశీల్దార్ల చేసిన విజ్ఞప్తి పట్ల సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా 378 మంది తహశీల్దార్లను ఒకేసారి బదిలీ చేస్తూ సర్కారు ఆదేశాలు జారీ చేసింది.

Samayam Telugu 17 Nov 2019, 8:16 pm
భారీగా తహశీల్దార్‌లను బదిలీ చేస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి 378 మంది తహశీల్దార్లను ట్రాన్స్‌ఫర్ చేసింది. జోన్ 5లో 166 మందిని, జోన్ 6లో 212 మందిని బదిలీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బదిలీ చేసిన వారిని.. తిరిగి సొంత జిల్లాలకు పంపుతూ రెవెన్యూ శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. తమను బదిలీ చేయాలంటూ గత కొంతకాలంగా రెవెన్యూ ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. తహశీల్దార్ల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్... వారిని బదిలీ చేశారు.
Samayam Telugu kcr meeting rtc.


తహశీల్దార్ల రిపాట్రియేషన్ ప్రొసీడింగ్స్‌ను సీసీఎల్ఏ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ విడుదల చేశారు. ప్రత్యామ్నాయాల కోసం వేచి చూడకుండా.. తహశీల్దార్లను వెంటనే సొంత జిల్లాలకు రిలీవ్ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

రిపాట్రియేట్ అయిన తహశీల్దార్లు సోమవారమే జిల్లా కలెక్టర్లకు రిపోర్ట్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏను కలిసిన ట్రెసా ఆఫీస్ బేరర్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కొద్ది రోజుల క్రితమే అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని.. సురేష్ అనే వ్యక్తి ఆమె ఆఫీసులోనే పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విజయారెడ్డి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ నిందితుడు ప్రాణాలు వదిలాడు. మంటల బారి నుంచి విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయ్నతించిన డ్రైవర్ కూడా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయిన సంగతి తెలిసిందే.

Read Also: అశ్వత్థామరెడ్డి దీక్ష భగ్నం.. ఉస్మానియాకు తరలింపు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.