యాప్నగరం

Muncipal Elections: హైకోర్టులో విచారణ మళ్లీ వాయిదా

Telangana High Court: ఈ వ్యవహారంలో పురపాలక చట్టం నిబంధనలు పాటించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రకాశ్ రెడ్డి కోర్టుకు తెలిపారు. నిబంధనలు తుంగలో తొక్కి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని వివరించారు.

Samayam Telugu 7 Jan 2020, 4:30 pm
పురపాలక ఎన్నికలపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. దీంతో మున్సిపల్‌ ఎన్నికలకు మంగళవారం జారీ కావాల్సిన నోటిఫికేషన్‌ ఇంకా సందిగ్ధంలోనే ఉండిపోయింది. ఎన్నికల షెడ్యూల్‌పై దాఖలైన వ్యాజ్యంపై మంగళవారం విచారణ ముగిసేంత వరకు నోటిఫికేషన్‌ను నిలుపుదల చేయాలని ఎస్ఈసీని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ మంగళవారం నాడు విచారణకు వచ్చింది. ఈ వ్యవహారంలో పురపాలక చట్టం నిబంధనలు పాటించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రకాశ్ రెడ్డి కోర్టుకు తెలిపారు. నిబంధనలు తుంగలో తొక్కి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని వివరించారు.
Samayam Telugu telangana high court


అయితే, ఎస్ఈసీ విధానాల వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటని హైకోర్టు పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. దీంతో రిజర్వేషన్లు ప్రకటించాకే షెడ్యూల్ విడుదల చేయాలని న్యాయవాది కోర్టుకు తెలిపారు. కానీ గత నెల 23న రిజర్వేషన్లు ప్రకటించకుండానే షెడ్యూల్ విడుదల చేసినట్లు గుర్తు చేశారు. ఎన్నికల ముందస్తు ప్రక్రియంతా హడావుడిగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ నెల 4న రిజర్వేషన్ల జాబితా విడుదల చేశాక, 7న నోటిఫికేషన్ విడుదల చేసి, 8 నుంచి నామినేషన్లు స్వీకరిస్తే అభ్యర్థుల ఎంపిక ఇబ్బందిగా మారుతుందని న్యాయవాది ధర్మాసనానికి వివరించారు.

ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్‌ను పక్కనబెట్టి తాజాగా మళ్లీ షెడ్యూల్‌ జారీ చేయాల్సిందిగా ఆదేశించాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఈ పిటిషన్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని తొలుత హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. విచారణ పూర్తయ్యే వరకూ నోటిఫికేషన్ విడుదలపై స్టే విధించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.