యాప్నగరం

బోనాలు అమ్మవారి ఊరేగింపుపై.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

కరోనా కారణంగా ఇప్పటికే అన్ని రకాల పండగల్ని ప్రభుత్వాలురద్దు చేశాయి. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా పండగల్ని ఇంటికే పరిమితం కావాలని ప్రభుత్వాలు ఆదేశించాయి.

Samayam Telugu 11 Jul 2020, 3:36 pm
తెలంగాణలో బోనాల పండగ ప్రత్యేకత వేరు. ఆషాఢం అనగానే ఇక్కడ ప్రజలకు గుర్తుకువచ్చేది బోనాలు. భాగ్యనగరంలో ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. బోనం అనేది భోజనం అనే పదానికి వికృతి. మా బిడ్డల్ని , ఇంటి మనుషుల్ని మాత్రమే కాకుండా మొత్తం ఊరంతా చల్లగా చూస్తున్న అమ్మోరి త‌ల్లికి భ‌క్తితో బోనం స‌మ‌ర్పిస్తారు. ఊరువాడా ఈ సందడే కనిపిస్తోంది. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ... పేరు ఏదైతేనేం... తమను చల్లగా చూడాలంటూ ఊరి ప్ర‌జ‌లు ఒక శక్తిస్వరూపాన్ని ఆరాధించడం ఆనవాయితీ
Samayam Telugu బోనాల జాతర

bonalu festival



ఇక భాగ్యనగరంలో అయితే బోనాల పండగ హడావుడి మామూలుగా ఉండదు. ఎక్కడ చూసిన ఆడపడుచులే సంప్రదాయ కట్టుబాట్లతో కనబడుతూ.. బోనాలతో సందడి చేస్తున్నారు. ప్రతీ ఏటా తెలంగాణ ప్రజలంతా ఎంతో వైభవంగా చేసుకునే ఈ ఉత్సవాలు ఈ సారి మాత్రం కళ తప్పేలా ఉన్నాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో అమ్మవారి ఊరేగింపులకు అనుమతి లేదని హైకోర్టు పేర్కొంది. కరోనా కేసులు ప్రబులుతున్న నేపథ్యంలో ఊరేగింపులు సరికాదని న్యాయస్థానం పేర్కొంది.

బోనాల పండగ సందర్భంగా అమ్మవారి ఊరేగింపునకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అక్కన్న , మదన్న ఆలయ నిర్వాహకులు ఈ పీల్ దాఖలు చేశారు.పాత బస్తీ, హరిబౌలి శాలిబండ లోని చారిత్రాత్మక కట్టడంలో అక్కన్న మదన్న ఆలయం ఒకటి. కరోనా సాకుతో బోనాల పండుగను నిలిపివేసింది. దశాబ్దాల కాలం నుండి వస్తున్న ఆమ్మవారి ఊరేగింపు కు అనుమతి ఇవ్వాలని పిటీషనర్ కోరారు. సంప్రదాయాలకు విఘాతం కలగకుండా చూడాలని ఆలయ నిర్వాహకులు కోరారు. కరోనా వ్యాధుల నుండి ప్రజలను రక్షించాలని అమ్మవారిని ప్రార్ధిస్తూ బోనాల పండుగ జరుపుతామని పిటీషనర్ హైకోర్టుకు పేర్కొన్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.