యాప్నగరం

మేం చెప్పేది అర్థం కాట్లేదా.. నిర్మల్ కలెక్టర్‌పై హైకోర్టు ఫైర్

TS High Court: న్యాయమూర్తి చెప్పేది చెప్పేది నాలుగో తరగతి ఉద్యోగికి కూడా అర్థమవుతుందని.. కానీ నిర్మల్ జిల్లా కలెక్టర్‌కు ఎందుకు అర్థం కావడంలేదని హైకోర్టు న్యాయమూర్తులు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 9 Oct 2020, 8:15 pm
నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్మల్ పట్టణంలో ఉన్న కుంటలు, చెరువుల్లో కొంత మంది చేస్తున్న అక్రమ కట్టడాలపై కలెక్టర్‌గా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కలెక్టర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంపై గతంలో కూడా తాము ఆదేశాలు ఇచ్చామని గుర్తు చేసింది. ఆ ఆదేశాలను ఎందుకు పాటించలేదో సమాధానం చెప్పాలని కోర్టు ఆదేశింది.
Samayam Telugu తెలంగాణ హైకోర్టు
telangana high court


పట్టణం పరిధిలోని కంచరోలి, ఇబ్రహీం ట్యాంక్‌ చెరువులో చేపట్టిన అక్రమ నిర్మాణలను కలెక్టర్ ఎందుకు అడ్డుకోవడం లేదో తెలపాలని కోర్టు ప్రశ్నించింది. న్యాయమూర్తి చెప్పేది చెప్పేది నాలుగో తరగతి ఉద్యోగికి కూడా అర్థమవుతుందని.. కానీ నిర్మల్ జిల్లా కలెక్టర్‌కు ఎందుకు అర్థం కావడంలేదని హైకోర్టు న్యాయమూర్తులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే సోమవారం అక్టోబర్‌ 12వ తేదీన వ్యక్తిగతంగా కలెక్టర్ హైకోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.