యాప్నగరం

టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు హైకోర్టులో ఊరట

రూ.లక్ష చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని.. ప్రతి శనివారం ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాలని షరతు విధించింది. దర్యాప్తు కొనసాగించేందుకు ఈడీకి హైకోర్టు అనుమతిచ్చింది.

Samayam Telugu 17 Jul 2020, 1:08 pm
టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈడీ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తనను అరెస్టు చేయకుండా బెయిల్‌ మంజూరు ఇవ్వాలని రవిప్రకాశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ముందస్తు బెయిల్‌ ఇచ్చింది. రూ.లక్ష చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని.. ప్రతి శనివారం ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాలని షరతు విధించింది. దర్యాప్తు కొనసాగించేందుకు ఈడీకి హైకోర్టు అనుమతిచ్చింది.
Samayam Telugu రవి ప్రకాష్


రవిప్రకాష్, మరో ఇద్దరు అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ నుంచి 2018 సెప్టెంబర్‌ నుంచి 2019 మే వరకు రూ.18 కోట్ల నిధులను అనుమతుల్లేకుండా అకౌంట్ల నుంచి డ్రా చేశారని ఆ సంస్థ ప్రతినిధులు బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2019 అక్టోబర్‌లో కేసు నమోదుకాగా.. ఇటీవల ఈడీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఈసీఐఆర్‌) నమోదు చేసింది. దీంతో రవి ప్రకాష్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.