యాప్నగరం

ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేత... నేడు హైకోర్టులో విచారణ

ఇవాళ హైకోర్టులో విచారణలో భాగంగా కోర్టుకు ఆస్పత్రికి సంబంధించి గూగుల్ సైట్ మ్యాప్‌ను ప్రభుత్వం సమర్పించనుంది. వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా కట్టడాన్ని కూల్చవద్దని పలువురు కోరుతున్నారు.

Samayam Telugu 8 Sep 2020, 11:31 am
ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేత, నూతన నిర్మాణం పై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది.ఉస్మానియా ఆసుపత్రి పై ఇప్పటి వరకు ధాఖలైన పిటిషన్ల కలిపి నేడు మరోసారి విచారించనున్నది. ప్రస్తుతం ఉన్న భవనం శితిలావస్థకు చేరిందని దీనిని తొలగించి నూతన భవనం నిర్మించాలని ప్రభుత్వం కౌంటర్ ధాఖలు చేసింది. అయితే ప్రస్తుతం ఉన్న ఉస్మానియా ఆసుపత్రి భవనం పురాతన కట్టడం అని దానిని కూల్చివేయ్యద్దని పిటీషనర్ల వాదనలు వినిపించారు.
Samayam Telugu ఉస్మానియా ఆస్పత్రి
osmania hospital


ఎర్రమంజిల్ భవనం పై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును గురించి పిటిషనర్లు ప్రస్తావించారు.ఎర్రమంజిల్ కు ఇచ్చిన తీర్పు ఉస్మానియా ఆసుపత్రి కి వర్తిస్తుందని పిటీషనర్లు వాదనలు వినిపించారు.గతంలో దీనిపై విచారించిన న్యాయస్థానం ఉస్మానియాకు సంబంధించిన గూగుల్ సైట్ మ్యాప్ ఇవ్వాలని హైకోర్టు కోరింది. దీంతో ప్రభుత్వం ఇవాళ హైకోర్టు కు ఆ మ్యాప్ సమర్పించనుంది.

Read More: కరోనా భయంతో.. చికెన్ శానిటైజ్ చేసి తిన్నాడు

హైదరాబాద్ అఫ్జల్ గంజ్‌లో ఉన్న ఉస్మానియా ఆస్పత్రి నిజాం కాలంలో నిర్మించారు. నిజాం ఆఖరి నవాబు అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయంలో ఇది నిర్మితమైంది. దీంతో ఈ కట్టడానికి ఉస్మానియా అని పేరు వచ్చింది. ఈ భవనానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయ్యాక సీఎం కేసీఆర్ ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. ప్రస్తుతం ఉన్న పాత భవనాన్ని కూల్చివేసి రెండు టవర్లతో అధునాతన హంగులతో కొత్త భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.