యాప్నగరం

700 మంది విద్యార్థినులకు ఒక్కటే టాయిలెటా: హైకోర్టు ఆగ్రహం

Saroornagar Govt College: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన వసతుల కోసం ఏమేం చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. ఏప్రిల్‌ 25 లోగా విద్యాసంస్థల్లోని మౌలిక వసతులపై నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ప్రభుత్వ కళాశాలలో 700 మంది విద్యార్థులకు ఒక్కటే మూత్రశాల ఉండటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే ప్రభుత్వ విద్యా సంస్థల్లో బాలికలకు మౌలిక వసతులను కల్పించాలని హైకోర్టు ఆదేశించింది

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 2 Mar 2023, 8:08 pm
హైదరాబాద్‌: సరూర్‌నగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో టాయిలెట్ల సమస్యపై కొన్ని రోజుల కిందట విద్యార్థినులు వెలుబుచ్చిన ఆవేదన అందరినీ కదిలించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 700 మంది విద్యార్థినులకు ఒకే టాయిలెట్ ఉండటం ఏంటని ప్రశ్నించింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో బాలికలకు మౌలిక వసతులను యుద్ధ ప్రాతిపదికన కల్పించాలని ఆదేశించింది. సరూర్‌నగర్ ప్రభుత్వ కాలేజీ సమస్యలపై ఎల్‌ఎల్‌బీ విద్యార్థి మణిదీప్‌ రాసిన లేఖను సుమోటోగా తీసుకున్న తెలంగాణ హైకోర్టు.. గురువారం (మార్చి 2) విచారణ చేపట్టింది.
Samayam Telugu Telangana High Court
తెలంగాణ హైకోర్టు


రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన వసతుల కోసం ఏమేం చర్యలు తీసుకుంటున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏప్రిల్‌ 25 లోగా విద్యాసంస్థల్లోని వసతులపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ కార్యదర్శి, ఇంటర్‌ బోర్డు కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.