యాప్నగరం

కోమటిరెడ్డికి భద్రత కల్పించండి.. డీజీపీకి హైకోర్టు ఆదేశం

Telangana High Court: తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కోమటిరెడ్డికి 2+2 భద్రత కల్పించాలని తెలంగాణ డీజీపీని ఆదేశించింది.

Authored byసందీప్ పూల | Samayam Telugu 4 Apr 2023, 3:37 pm

ప్రధానాంశాలు:

  • కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అదనపు భద్రత
  • 2+2 భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశం
  • డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీకి ఆదేశాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Komatireddy Rajgopal Reddy
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Komatireddy Rajgopal Reddy: బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రాణహానీ ఉందని, రక్షణ కల్పించేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. కోమటిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. వాదనలు విన్న న్యాయస్థానం.. రెండు వారాల్లో రాజగోపాల్ రెడ్డికి భద్రత కల్పించాలని ఆదేశించింది. 2+2 సెక్యూరిటీ కల్పించాలని రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఇక గతేడాది కాంగ్రెస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 2018లో కాంగ్రెస్ టికెట్‌పై మునుగోడు నియోజవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన 2022 చివర్లో పార్టీకి, తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతరం బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికలకు వెళ్లారు. ఆ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో 10 వేల పైచిలుకు ఓట్ల తేడాతో కోమటిరెడ్డి ఓటమి పాలయ్యారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.