యాప్నగరం

తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ఆపండి.. హైకోర్టు ఆదేశం

TS High Court: కోవిడ్ కారణంగా విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయిన విషయం వాస్తవమేనని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఎంసెట్‌ నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేస్తుందని హైకోర్టుకు ఏజీ తెలిపారు.

Samayam Telugu 28 Oct 2020, 10:19 pm
తెలంగాణ ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ ఆపాలని హైకోర్టు జేఎన్టీయూను ఆదేశించింది. కోవిడ్ కారణంగా కనీస మార్కులు 35తో విద్యార్థులను ప్రభుత్వం పాస్ చేసిన సంగతి తెలిసిందే. ఎంసెట్ నిబంధనల ప్రకారం వార్షిక పరీక్షలలో 45 శాతం మార్కులు తప్పనిసరిగా రావాలి. దీంతో విద్యార్థులు చాలా మంది ఎంసెట్ అర్హత కోల్పోయారు. అయితే బాధిత విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. విద్యార్థుల పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వ వాదనలను విన్నది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
telangana high court


కోవిడ్ కారణంగా విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయిన విషయం వాస్తవమేనని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఎంసెట్‌ నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేస్తుందని హైకోర్టుకు ఏజీ తెలిపారు. దీంతో ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు కౌన్సెలింగ్ ఆపాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో గురువారం జరిగే కౌన్సెలింగ్‌కు అడ్డుకట్ట పడినట్లయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.