యాప్నగరం

ఆన్‌లైన్ క్లాసులు, అధిక ఫీజులపై హైకోర్టులో విచారణ.. ఏప్రిల్ 23కు వాయిదా

TS High Court: కరోనా కారణంగా లాక్ విధించడంతో విద్యాసంస్థలు ఆన్లైన్ తరగతులను ప్రారంభించాయి. అయినా అన్ని పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Samayam Telugu 22 Jan 2021, 4:06 pm
ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్ లైన్ తరగతులు, అధిక ఫీజులపై హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై తదుపరి విచారణను హైకోర్ట్ ఏప్రిల్ 23 కి వాయిదా వేసింది. కరోనా కారణంగా లాక్ విధించడంతో విద్యాసంస్థలు ఆన్లైన్ తరగతులను ప్రారంభించాయి. అయితే, ఆన్లైన్ తరగతులు ప్రారంభించడంతో అన్ని పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
telangana high court


అయితే, ఇప్పుడు 9వ తరగతి పైబడి తరగతులు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. దీనిపై హైకోర్టు ముందుగా ఈ నెల జనవరి 31 వరకు పరిణామాలే పరిశీలిస్తామని తెలిపింది. అయితే ఆన్లైన్ క్లాసులు జరపడం వలన పాఠశాల యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తున్న దానిపై జీవో 46 ఉల్లంఘన జరుగుతోందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. పాఠశాలలు తెరిచాక కూడా ఇతర ఫీజులు తీసుకోరాదా? అని హైకోర్టు ప్రశ్నించింది.

జీవో 46 ప్రకారం బోధన రుసుము మాత్రమే తీసుకోవాలని న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు ఏప్రిల్ వరకు విచారణ జరుపుతామని తెలపడంతో వెంటనే న్యాయవాది అప్పట్లోగా పాఠశాలలు ఫీజులు వసూలు చేస్తారని, త్వరగా విచారణ జరపాలని కోర్టును కోరారు. దీనికి సంబంధించి హైకోర్టు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ సూచించిన నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తే తిరిగి చెల్లించేలా ఆదేశిస్తామని వెల్లడించింది. తదుపరి విచారణను హైకోర్టు ఏప్రిల్ 23 కు వాయిదా వేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.