యాప్నగరం

High Court | KCR: టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు..

టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వ భూకేటాయింపులకు సంబంధించి ఈ నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

Authored byRaj Kumar | Samayam Telugu 23 Jun 2022, 2:02 pm
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎన్‌బీటీ నగర్‌లో టీఆర్ఎస్‌ పార్టీ కార్యాలయానికి భూమి కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. రూ.కోట్ల విలువ చేసే భూమిని తక్కువ ధరకు కేటాయించారంటూ రిటైర్డ్‌ ఉద్యోగి మహేశ్వర్‌రాజ్‌ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. టీఆర్ఎస్ హైదరాబాద్‌ కార్యాలయం కోసం 4,935 గజాల అత్యంత ఖరీదైన స్థలాన్ని గజం రూ.100కే కేటాయించారని పిటిషన్‌లో తెలిపారు.
Samayam Telugu High Court notices to KCR


అలాగే హైదరాబాద్ సహా 33 జిల్లాల్లో ఇలాగే భూకేటాయింపు జరిగిందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై తాజాగా ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డితో పాటు సీఎస్‌, సీసీఎల్‌ఏ, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌‌లకు కోర్టు నోటీసులు ఇచ్చింది. దీనిపై నాలుగు వారాల్లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.