యాప్నగరం

మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట.. రేవంత్‌కు చుక్కెదురు

High Court: మంత్రి కేటీఆర్‌కు ఎన్జీటీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిని సవాలు చేస్తూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించడంతో ధర్మాసనం ఆ ఉత్తర్వులపై స్టే విధించింది.

Samayam Telugu 10 Jun 2020, 3:19 pm
తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు ఫాంహౌజ్ వ్యవహారంలో హైకోర్టులో కాస్త ఊరట లభించింది. హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా జన్వాడలో ఫామ్‌హౌస్‌పై వివరణ ఇవ్వాలని జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నోటీసులను మంత్రి కేటీఆర్‌ హైకోర్టులో సవాలు చేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఎన్టీటీ ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ స్టే ఇచ్చింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Telangana high court


జన్వాడ ఫామ్‌ హౌస్‌‌ను మంత్రి కేటీఆర్ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించి నిర్మించారని ఆరోపిస్తూ మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ఎన్జీటీ.. పిటిషన్ దారు దాఖలు చేసిన వ్యాజ్యంలోని ఆరోపణలపై వివరణ ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌కు ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ మంత్రి హైకోర్టును ఆశ్రయించడంతో ధర్మాసనం ఆ ఉత్తర్వులపై స్టే విధించింది. ఫాంహౌజ్ వ్యవహారంలోనే ప్రస్తుతం అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.