యాప్నగరం

తెలంగాణ పోలీసులపై హైకోర్టులో పిల్.. విచారణ నేడు..

PIL on telangana Police: కొద్ది రోజుల క్రితం వనపర్తిలో తండ్రీ కొడుకు బైక్‌పై వెళ్తుండగా పోలీసులు దాడి ఘటనను లేఖలో ప్రస్తావించారు. దాడి చేసిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని న్యాయవాది ఉమేష్ చంద్ర కోరారు.

Samayam Telugu 8 Apr 2020, 12:32 am
లాక్ డౌన్ సందర్భంగా పోలీసులు ప్రజల పట్ల ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. దీనిని హైకోర్టు బుధవారం విచారణ జరపనుంది. ఓ ప్రముఖ న్యాయవాది రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా స్వీకరించింది. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలపై పోలీసులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆ న్యాయవాది లేఖ రాశారు. ఐదు పేజీల ఆ లేఖను ప్రధాన న్యాయమూర్తికి న్యాయవాది ఉమేష్ చంద్ర అందజేశారు.
Samayam Telugu telangana high court


Must Read: హైదరాబాద్‌లో కరోనా కారు చక్కర్లు.. అప్పుడు కండోమ్ బైక్ కూడా..

కొద్ది రోజుల క్రితం వనపర్తిలో తండ్రీ కొడుకు బైక్‌పై వెళ్తుండగా పోలీసులు దాడి ఘటనను లేఖలో ప్రస్తావించారు. దాడి చేసిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఉమేష్ చంద్ర కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి విచక్షణ రహితంగా కొట్టారంటూ ఆరోపించారు. జ్యూడిషియల్ కమిటీ ద్వారా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విచక్షణ రహితంగా కొట్టే హక్కు పోలీసులకు ఏ విధంగా ఉందో తెలపాలని పిటిషనర్ కోరారు. ఈ నేపథ్యంలో లేఖను పిల్‌గా హైకోర్టు స్వీకరించింది.

Also Read: సీఎం బుర్ర లేకుండా మాట్లాడొద్దు.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

ఈ వ్యాజ్యం బుధవారం ఉదయం న్యాయస్థానం విచారణ చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలపై పోలీసులు దాడులకి సంబంధించిన వివరాలను పిటిషనర్ అందించారు.

Also Read: వాహ్ పోలీస్ డ్రోన్స్.. పోకిరీలకు ముచ్చెమటలు.. ఆగకుండా పరుగులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.