యాప్నగరం

సీఎం జగన్‌పై అసభ్య పోస్ట్‌.. తెలంగాణ వ్యక్తి అరెస్ట్‌

సీఎం వైఎస్ జగన్‌పై ఫేస్‌బుక్ అసభ్యకరంగా పోస్టు పెట్టిన ఓ వ్యక్తిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని నల్గొండకు చెందిన సెక్యూరిటీ గార్డు నవీన్ కుమార్‌గా గుర్తించారు.

Samayam Telugu 29 Aug 2019, 10:32 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్ట్ పెట్టిన ఓ వ్యక్తిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన నవీన్ కుమార్ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఏపీ సీఎం జగన్‌తో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టాడు. వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడు నవీన్ కుమార్‌ను గుర్తించి గురువారం (ఆగస్టు 29) అదుపులోకి తీసుకున్నారు.
Samayam Telugu arrest


నిందితుడు నవీన్ కుమార్ గౌడ్‌.. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండటం గమనార్హం. అతడిపై గతంలో వనపర్తి గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. అతడిని అమరావతికి తీసుకెళ్లి విచారించనున్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్‌పై అనుచిత పోస్టుల పెట్టి ఏపీలో ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు కటకటాల పాలైన సంగతి తెలిసిందే.

Must Read: మాజీ సీఎం చంద్రబాబుపై కేసీఆర్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు

సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. గతంలో హోం మంత్రి సుచరిత, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజాపై ఇలాగే అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

Also Read: తెలంగాణలో టీడీపీ పుంజుకునేలా చేస్తా.. చంద్రబాబు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.