యాప్నగరం

వీడియో: మంత్రి సాక్షిగా దళిత మహిళా సర్పంచికి అవమానం

Khammam: గ్రామ పరిధిలో అధికారిక కార్యక్రమం ఏర్పాటు చేసి గ్రామ సర్పంచినే వేదిక మీదకు పిలవలేదు. ఇదేంటని నిలదీస్తే ఓ వ్యక్తిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు కరోనాను బూచీగా చూపారు.

Samayam Telugu 21 Jul 2020, 12:18 am
రోనా వైరస్ వ్యాప్తి, పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. మరో దుమారం రేగింది. మంత్రి సాక్షిగా ఓ దళిత మహిళా సర్పంచికి అవమానం జరిగింది. గ్రామంలో చేపట్టిన అధికార కార్యక్రమంలో వేదికపై సర్పంచ్‌కు స్థానం లేకుండా పోయింది. ‘ఇదేంటీ.. సర్పంచ్‌ను వేదిక మీదకు పిలవరా?’ అని ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నిలదీయగా.. అలా ప్రశ్నించినందుకు మంత్రి గారికి కోపం వచ్చింది. అందరి ముందే అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై కేసు పెట్టాల్సిందిగా పోలీసులను ఆదేశించారు.
Samayam Telugu సర్పంచికి ప్రోటోకాల్ వర్తించదా..?
Dalit Woman Sarpanch insulted in Khammam


ఖమ్మం జిల్లా మద్దులపల్లి గ్రామంలో కొవిడ్ కేర్ సెంటర్ ఓపెనింగ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. వ్యక్తిపై మంత్రి కోపంతో ఊగిపోతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సర్పంచిని వేదిక పైకి పిలవడానికి కరోనాను బూచిగా చూపడం గమనార్హం.

చాలా చిన్న సమావేశమే అయినా.. వేదిక ఏర్పాటు చేసిన గ్రామ పరిధిలోని ప్రథమ పౌరురాలిని జనం మధ్యలోనే కూర్చోబెట్టి.. మంత్రి సహా ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు వేదికపై కూర్చున్నారు. సర్పంచికి మాత్రం కరోనా అడ్డొంచ్చిందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఉండబట్టలేక వేదిక మీదున్న పెద్దలను నిలదీశాడు. ఎంపీపీ, జడ్పీటీసి, ఎమ్మెల్యే, మంత్రి, కలక్టర్‌ను ఉద్దేశించి.. మా సర్పంచ్‌ను కూడా వేదిక మీదకు పిలవండని సూచించాడు. ఇంతలో మంత్రి కలుగజేసుకొని అతడిపై విరుచుకుపడ్డారు. గెటవుట్ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో అతడు అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

ఇదంతా గమనిస్తున్న ఆ దళిత సర్పంచ్ మాత్రం ఎలా స్పందించాలో తెలియక అలాగే కూర్చుండిపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా.. స్థానిక ఎమ్మెల్యే కలుగజేసుకొని సదరు వ్యక్తి మనవాడే అని మంత్రికి చెప్తుండటం కొసమెరుపు.

Also Read: వరదలో కొట్టుకుపోయిన ఇళ్లు.. సామన్లు సర్దే సమయం కూడా లేదు

Don't Miss: ఢిల్లీలో పాప.. లేహ్‌లో తల్లి.. విమానంలో తల్లిపాలు, అంతా మానవత్వమే

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.