యాప్నగరం

Pragathi Bhavan Siege: పోలీసులకు చిక్కని రేవంత్ రెడ్డి.. ఎంపీ జాడ కోసం వెతుకులాట

కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో.. పోలీసులు ఆ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డి పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Samayam Telugu 21 Oct 2019, 1:19 pm
ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో.. పోలీసులు మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కోసం వెతుకుతున్నారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ముందు జాగ్రత్తగా ఆ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ముందస్తుగా చాలా మంది నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారని ఆయన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో వీడియోను పోస్టు చేశారు.
Samayam Telugu revanth1


కానీ రేవంత్ రెడ్డి ఇంట్లో లేరని తెలుస్తోంది. దీంతో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. ప్రగతి భవన్‌ సమీపంలో ఉన్న హోటళ్లలో రేవంత్ కోసం తనిఖీలు చేస్తున్నారు. రేవంత్‌ అనుచరుల ఇళ్లనూ పోలీసులు చెక్‌ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకూ రేవంత్ జాడ తెలియలేదు. ఆయన ఎక్కడున్నారో తెలుసుకోవడం కోసం పోలీసులు తిప్పలు పడుతున్నారు. తర్వాత వచ్చిన ప్రగతి భవన్ ముట్టడి కోసం వచ్చిన ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించిన నేతలను పోలీసులు ఎక్కడిక్కడ అరెస్ట్ చేశారు. వీరిని వాహనాల్లో ఉంచి హైదరాబాద్ చుట్టూ తిప్పుతున్నారు. సాయంత్రం వరకు వీరిని ఇలాగే నగరం చుట్టూ తిప్పుతారని తెలుస్తోంది. సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తుండటంతో.. ప్రగతి భవన్‌తోపాటు చుట్టూ 4 కి.మీ. మేర ఉన్న సర్కిళ్లలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
Read Also: పోలీసుల కళ్లుగప్పి.. ప్రగతి భవన్‌కు చేరుకున్న రేవంత్ రెడ్డి

ఏడాది క్రితం.. బెడ్రూం తలుపులు పగలగొట్టి మరీ..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్‌ కోస్గిలో బహిరంగ సభలో నిర్వహించడానికి ముందు పోలీసులు రేవంత్ ఇంటిపై దాడి చేశారు. దీనికి నిరసనగా రేవంత్ అర్ధరాత్రి సమయంలో రోడ్డుపై ధర్నా చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో నియోజకవర్గంలో ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలని, కేసీఆర్‌ను అడ్డుకోవాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతో ఊహించని రీతిలో అక్టోబర్ 3, 2018న అర్ధరాత్రి దాటిన తర్వాత ఏకంగా బెడ్‌రూం తలుపులు పగలగొట్టిన పోలీసులు.. రేవంత్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటన అప్పట్లో వివాదాస్పదమైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.