యాప్నగరం

మండుతున్న ఎండలు, ఉక్కపోత... అనూహ్యంగా మారిన వాతావరణంతో జనం ఇబ్బందులు

గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. ముఖ్యంగా తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. విపరీతమైన ఉక్కపోతతో జనం విలవిల్లాడుతున్నారు.

Samayam Telugu 8 Sep 2020, 6:46 am
ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. గతం వారం రోజులుగా ఎండలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉక్కపోత కూడా తీవ్రంగా ఉంటోంది. అధిక వేడి, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెప్టెంబర్ నెలలో హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా 30 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతాయి. కానీ గత కొద్ది రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు చేరువలో నమోదవుతున్నాయి.
Samayam Telugu సూర్యుడు
Representative image


సోమవారం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటాయి. సాధారణం కంటే 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉండటం.. పొడి వాతావరణం, గాల్లో తేమ ఎక్కువగా ఉండటంతో నగర వాసులు ఇబ్బంది పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి.

షాపూర్ నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో సోమవారం గరిష్ట ఉష్ణోగ్రతలు 35.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా... కూకట్ పల్లిలో 35.7 డిగ్రీలు, రాజేంద్ర నగర్‌లో 35.6 డిగ్రీలు, మల్కాజిగిరిలో 35.5 డిగ్రీలుగా నమోదయ్యాయి. హయత్ నగర్‌లో 36.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం ఖమ్మం జిల్లాలోని వైరాలో 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది తెలంగాణలోకెల్లా అత్యధికం కావడం గమనార్హం.

వచ్చే రెండు రోజుల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.