యాప్నగరం

తెలంగాణ ప్రజలకు ఊరట.. స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

కరోనా కేసుల విషయంలో తెలంగాణ ప్రజలకు కాస్త ఊరట లభించింది. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మరోవైపు కొన్ని చోట్ల ఆధార్ కార్డు ఉంటేనే టెస్టులు చేస్తామంటున్నారు.

Samayam Telugu 16 Aug 2020, 9:59 am
దేశవ్యాప్తంగా ప్రజల్ని కరోనా వైరస్ పట్టి పీడిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో కూడా నిత్యం వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటలవరకు కొత్తగా 1930 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1102 కరోనా కేసులు నమోదవగా, తొమ్మిది మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసులు 91,361కుచేరగా, 693 మంది కరోనా వల్ల చనిపోయారు. ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో 22,542 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 68,126 మంది బాధితులు కోలుకున్నారు.
Samayam Telugu తెలంగాణ కరోనా కేసులు
corona cases in telangana


కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 234 కేసులు, కరీంనగర్ జిల్లాలో 101, రంగారెడ్డి 81, మేడ్చల్ మల్కాజిగిరి 63, సంగారెడ్డిలో 66 చొప్పున కేసులు ఉన్నాయి. అయితే తెలంగాణలో జరుగుతున్న కరోనా టెస్టుల విషయంలో పలు విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో పలు చోట్ల ఆధార్ కార్డు లేకుంటే కరోనా టెస్టులకు నమూనాలు సేకరించేందుకు వైద్య సిబ్బంది నిరాకరిస్తున్నారు.
Read More: Telangana Rains: ప్రభుత్వం అప్రమత్తం.. కంట్రోల్ రూం నెంబర్ ఇదే..
తల్లిదండ్రులతో కలిసి కరోనా టెస్టుల కోసం కోవిడ్ నిర్ధారణ కేంద్రాలకు వెళ్తున్న చిన్నారులకు ఆధార్ కార్డు లేకపోవడంతో వారికి పరీక్షలు నిర్వహించలేమని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఇలాంటి తరహ ఘటన ఒకటి తాజాగా రాజేంద్రనగర్‌లో జరిగింది. దీనితో వైద్య సిబ్బంది తీరుపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఆధార్ కార్డులో ఉన్న చిరునామానే వైద్య సిబ్బంది నమోదు చేస్తుండటంతో హోం ఐసోలేషన్ కిట్లు అందించడంలో సమన్వయం కొరవడుతోంది. మరోవైపు కరోనా టెస్టులు, కరోనా జాగ్రత్తల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై కూడా హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.