యాప్నగరం

తెలంగాణాలో 1473 కరోనా కేసులు.. జిల్లాల్లో విజృంభిస్తోన్న వైరస్!

తెలంగాణలో ఒక్క రోజులో 1473 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 55 వేలు దాటింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 506 కరోనా కేసులు నమోదయ్యాయి.

Samayam Telugu 27 Jul 2020, 12:22 pm
తెలంగాణలో 24 గంటల్లో కొత్తగా 1473 కరోనా కేసులు నమోదు కాగా.. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. జీహెచ్ఎంసీ పరిధిలో 506 కరోనా కేసులు నమోదు కాగా.. రంగారెడ్డిలో 168, వరంగల్ అర్బన్‌లో 111, సంగారెడ్డి జిల్లాలో 98, కరీంనగర్‌లో 91, మేడ్చల్ 86, నిజామాబాద్‌లో 41 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 55,532కి చేరగా.. మృతుల సంఖ్య 471కి చేరింది.
Samayam Telugu Covid-19
Representative image.


రాష్ట్రంలో ఒక్క రోజులో 9817 శాంపిళ్లను పరీక్షించారు. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 3,63,242కు చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 12,955 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కోవిడ్ మరణాల రేటు 0.85 శాతంగా ఉంది. జాతీయ మరణాల సగటు 2.3 శాతంతో పోలిస్తే ఇదెంతో తక్కువ కావడం గమనార్హం. ఆదివారం చేసిన టెస్టుల్లో పెద్దపల్లి, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో మాత్రమే కరోనా కేసులు నమోదు కాలేదు.

తెలంగాణలో మొత్తం 11,928 ఐసోలేషన్ బెడ్లు ఉండగా.. 11,253 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. 3537 ఆక్సిజన్ బెడ్లు ఉండగా.. 2468 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. గాంధీ హాస్పిటల్‌లో మొత్తం 1890 బెడ్లు ఉండగా.. 1029 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.

Don't Miss: ఆర్మీ జవాన్ భూమి కబ్జా చేసిన అధికార పార్టీ నేత

రాష్ట్రంలో 16 ప్రభుత్వ, 23 ప్రయివేట్ ల్యాబ్‌ల్లో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తుండగా.. ప్రభుత్వ ఆధ్వర్యంలో 320 హాస్పిటళ్లు, పీహెచ్‌సీల్లో ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారు.

Read Also: హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉందా.. మీకు గుడ్ న్యూస్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.