యాప్నగరం

తెలంగాణలో కాస్త తగ్గిన కరోనా.. ఇవాళ కేసులు ఎన్నంటే

నిన్న కూడా కరోనా కేసులు ఇలాగే నమోదు అయ్యాయి. రాష్ద్రంలో మరణాలు మాత్రం 12వందలు దాటాయి. అటు పాజిటివ్ కేసుల సంఖ్య కూడా రెండు లక్షల పదివేలు దాటింది.

Samayam Telugu 10 Oct 2020, 10:02 am
తెలంగాణాలో కరోనా కేసులు కాస్త తక్కువగా నమోదు అవుతున్నాయి. నిన్నటిలానే ఈరోజు కూడా కరోనా కేసులు రెండువేలకు తక్కువగానే నమోదయ్యాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 1,811 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,10,346 కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో తాజాగా మరో 9 మంది మరణించారు. దీంతో కరోనా మరణాల సంఖ్య1217 దాటింది. ఇక తెలంగాణా రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 26,104 గా ఉన్నాయి.
Samayam Telugu తెలంగాణ కరోనా కేసులు
corona cases in telangana


Read More: హైదరాబాద్ గోకార్టింగ్ సీజ్.. నిర్వాహకులు అరెస్ట్

ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 1,83,025 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 2,072 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 86.01% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 85.7 % శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.57 %గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 50,469 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 35,00,394 పరీక్షలు చేసారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 291 కేసులు నమోదయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.