యాప్నగరం

తెలంగాణ కరోనా కేసులు.. ఇవాళ ఎన్నంటే

కరోనా కేసులు రాష్ట్రంలో నిత్యం రెండువేలు దాటుతున్నాయి. తాజాగా ఎనిమిది కరోనా బారిన పడటంతో మరణాల సంఖ్య 1070కు చేరింది.. అయితే రికవరీ రేటు బాగా పెరగడంతో రాష్ట్ర ప్రజలు కాస్త ఊరట పొందుతున్నారు.

Samayam Telugu 24 Sep 2020, 9:34 am
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇవాళ ఆ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా 2,176 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఎనిమిది మంది కరోనా కారణంగా మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,79,246కి చేరింది. ఇప్పటి వరకు 1070 మంది మృతిచెందారు.
Samayam Telugu తెలంగాణ కరోనా కేసులు
corona virus 21


Read More: హైదరాబాద్‌లో కేసీఆర్ కిట్ పంపిణీలో గోల్ మాల్..

ప్రస్తుతం రాష్ట్రంలో 30,037 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు కరోనాబారినపడి 1,48,139 మంది పూర్తిగా కోనుకున్నారు. అయితే రికవరీ రేటు విషయంలో తెలంగాణ ప్రజలకు కాస్త ఊరట లభిస్తోంది. భారత్‌లో కరోనా మరణాల రేటు 1.59 శాతంగా ఉంటే.. తెలంగాణలో 0.59 శాతంగా ఉంది. ఇక, కరోనా రికవరీ రేటు దేశవ్యాప్తంగా 81.42 శాతంగా ఉండగా.. తెలంగాణలో 82.64% శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 308, రంగా రెడ్డి జిల్లాలో 168, మేడ్చల్‌లో 151 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.