యాప్నగరం

తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా... తాజా కేసులు ఎన్నంటే

నిన్న తగ్గినట్లే తగ్గిన కరోనా మరోసారి రాష్ట్రంలో కలకలం రేపింది. నిన్న వెయ్యి దాటిన కేసులు.. ఇవాళ రెండువేలు దాటాయి. దీంతో మరోసారి తెలంగాణ ప్రజల్లో కరోనా టెన్షన్ మొదలయ్యింది.

Samayam Telugu 22 Sep 2020, 9:12 am
దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ప్రతీ రాష్ట్రంలో నిత్యం ఎంతో కొంత కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. తెలంగాణలో నిన్న తగ్గినట్లు తగ్గి మళ్లీ పాజిటివ్ కేసులుపెరిగాయి. నిన్న 1300 నమోదైన కేసులు ఇవాళ రెండువేల దాటాయి. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 2,166 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,74,774కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.
Samayam Telugu తెలంగాణలో మళ్లీ పెరిగిన కేసులు
corona virus


Read More: యువతిపై దాడి.. శేరిలింగంపల్లి కార్పొరేటర్ అరెస్ట్

నిన్న ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,052కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,143 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,44,073 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 29,649 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 22,620 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 309 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణాలో రికవరీ రేటు 82.43 శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 80.82 శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.60 శాతంగా ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.