యాప్నగరం

తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా.. ఇవాళ కేసులు 582

కరోనాతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1311కు చేరింది. ప్రతీ సారిలాగే గ్రేటర్‌లో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 91.40 శాతంగా ఉంది.

Samayam Telugu 26 Oct 2020, 9:11 am
తెలంగాణాలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. నిన్న రోజూ చేసే కరోనా టెస్ట్ ల కంటే చాలా మేరకు టెస్ట్లు తగ్గించడంతో కేసులు భారీగా తగ్గాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 582 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,31,834 కేసు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో నలుగురు మరణించారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 1311కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 18,611 ఉన్నాయి.
Samayam Telugu తెలంగాణ కరోనా కేసులు
corona cases in telangana


15,582 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 2,11,912 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 1,432 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో నిన్న 14,729 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 40,94,417 పరీక్షలు చేసారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 174 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా నల్గొండలో 87, రంగారెడ్డి జిల్లాలో 55 కేసులు నమోదయ్యాయి. తెలంగాణాలో రికవరీ రేటు 91.40% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 90.2% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.56%గా ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.