యాప్నగరం

తెలంగాణ ప్రజలకు శుభవార్త.. భారీగా తగ్గిన కరోనా కేసులు

గత రెండు రోజులుగా తగ్గుతున్న పాజిటివ్ కేసులు ఇవాళ భారీగా తగ్గాయి. ప్రస్తుతం తెలంగాణలో 15,425 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు పేర్కొనారు.

Samayam Telugu 15 Nov 2020, 10:18 am
తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత రెండు రోజులుగా కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 661 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,57,374కి చేరింది. మరణాల సంఖ్య 1404 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 15,425 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు పేర్కొనారు. ఇక కరోనా వైరస్ చికిత్స నుంచి కోలుకుని 2,40,545 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Samayam Telugu తెలంగాణలో భారీగా తగ్గిన కేసులు
corona in telangana


Read More: Konda Vishweshwar Reddy: రెండే రెండు గంటలు.. కేసీఆర్‌పై మాజీ ఎంపీ మరో పంచ్

ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 167 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 57, మేడ్చల్ జిల్లాలో 45 చొప్పున కేసులు రికార్డయ్యాయి. తెలంగాణలో కరోనా రికవరీ రేటు కూడా బాగానే ఉంది. 92 శాతంకు పైగా రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు ఉంది. దీంతో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.