యాప్నగరం

తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కారణం ఇదే!

తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య ఆదివారం చాలా వరకు తగ్గింది. సెలవు దినం కావడంతో టెస్టులు తక్కువగా చేయడమే దీనికి కారణంగా భావించొచ్చు.

Samayam Telugu 3 Aug 2020, 9:50 am
తెలంగాణలో ఆదివారం కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గింది. 9443 టెస్టులు చేయగా.. 983 పాజిటివ్‌గా గుర్తించారు. మరో 1414 శాంపిళ్ల ఫలితం తేలాల్సి ఉంది. కోవిడ్ కారణంగా 24 గంటల్లో 11 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 551కి చేరింది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 67,660కి చేరగా.. ప్రస్తుతం 18,500 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 71.8 శాతంగా ఉంది. రాష్ట్రంలోని 84 శాతం మంది కరోనా బాధితుల్లో లక్షణాలు కనిపించడం లేదు.
Samayam Telugu corona
Representative image


ఆదివారం నమోదైన 983 కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) పరిధిలో 273 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డిలో 73, వరంగల్ అర్బన్ 57, కరీంనగర్ 54, మేడ్చల్ 48, పెద్దపల్లి 44, నిజామాబాద్ 42, సంగారెడ్డి 37 చొప్పున కేసులు నమోదయ్యాయి. మంచిర్యాలలో అత్యల్పంగా ఒక్క కేసు మాత్రమే నమోదైంది.

ఇటీవలి కాలంలో హైదరాబాద్ పరిధిలో ఇంత తక్కువ మొత్తం కోవిడ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కానీ
ఆదివారం కావడంతో తక్కువ మొత్తంలో టెస్టులు చేయడంతో కరోనా బాధితుల సంఖ్య తగ్గింది.

ఆసిఫాబాద్, నారాయణపేట, నిర్మల్, వికారాబాద్, యాదాద్రి భువనగరి జిల్లాల్లో మాత్రమే కరోనా కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. జనగామ, జగిత్యాల, భూపాలపల్లి, వనపర్తి జిల్లాలోనూ కోవిడ్ కేసులు ఒకింత తక్కువగానే ఉన్నాయి. కానీ వరంగల్ అర్బన్, కరీంనగర్, సంగారెడ్డి జిల్లాల్లో కేసులు పెరుగున్న తీరు ఆందోళనకు గురి చేస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.