యాప్నగరం

సర్కారుతో చర్చలు విఫలం... సమ్మెకే ఆర్టీసీ కార్మికుల మొగ్గు

TSRTC Employees Strike | తెలంగాణ ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వ చర్చలు విఫలమయ్యాయి. పండుగ సమయంలో సమ్మె వద్దన్నా.. కార్మికులు వెనక్కి తగ్గడం లేదు. దీంతో అక్టోబర్ 5 నుంచి సమ్మె ఖాయమైనట్టే.

Samayam Telugu 2 Oct 2019, 4:52 pm
ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వ చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలు రాకపోవడంతో కార్మిక సంఘాలు సమ్మెకే మొగ్గు చూపాయి. దీంతో అక్టోబర్ 5 నుంచి ఆర్టీసీ బస్సులు ఎక్కడిక్కడ నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సోమేశ్ కుమార్ కమిటీ ముందు ఆర్టీసీ జేఏసీ 26 డిమాండ్లను ఉంచింది. తెలంగాణ ప్రజలు సొంతూళ్లకు వెళ్లే దసరా పండుగ ముందు సమ్మె చేయొద్దని ఐఏఎస్ అధికారి సోమేష్ సూచించారు. ఆర్టీసీ కార్మికులు సహకరించాలని కోరారు. ఆర్టీసీ సమస్యలను సమూలంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
Samayam Telugu tsrtc1


ముందుగా తక్షణం పరిష్కారమయ్యే సమస్యలపై దృష్టి పెట్టామని ఐఏఎస్ సోమేష్ కుమార్ ఆర్టీసీ కార్మికులతో తెలిపారు. ఆర్టీసీని ఆదుకునేందుకు, సమస్యల నుంచి గట్టెక్కించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. అన్ని అంశాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు.

కానీ ఆర్టీసీ కార్మికలు మాత్రం యథాతథంగా సమ్మె కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం ఎలాంటి నిర్దిష్ట కాలపరిమితి ఇవ్వలేదని వారు తెలిపారు. మా పోరాటం ఆర్టీసీని బతికించడానికని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ అశ్వద్ధామ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ సమ్మె ఖాయం కావడంతో పండుగ జరుపుకోవడం కోసం సొంతూళ్లకు వెళ్తున్న ప్రజల కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.