యాప్నగరం

bhainsaలో తీవ్ర ఉద్రిక్తతలు.. 144 సెక్షన్ అమలు.. మెల్లిగా ప్రశాంత వాతావరణం

భైంసాలో అదుపులోకి వచ్చిన పరిస్థితి.. రంగంలోకి దిగిన కలెక్టర్, ఎస్పీలు. 144 సెక్షన్ కొనసాగింపు. ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగిన టెన్షన వాతావరణం. చిన్న గొడవగా మొదలై ఘర్షణలు.

Samayam Telugu 13 Jan 2020, 10:48 am
నిర్మల్ జిల్లా భైంసాలో ఉద్రిక్తత పరిస్థితులు ఇప్పుడిప్పుడే చల్లారుతున్నాయి. ఆదివారం రాత్రి మొదలైన రెండు వర్గాల మధ్య మొదలైన రగడ్ తర్వాత ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. 144 సెక్షన్ అమలులో ఉండటంతో పోలీసుల్ని భారీగా మోహరించారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కలెక్టర్, ఎస్పీలు పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Samayam Telugu nirmal


భైంసాలో ఆదివారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతలకు దారి తీసింది. చిన్న గొడవగా మొదలై.. తర్వాత ఘర్షణకు దారి తీసింది. రాళ్ల దాడులు, ఇళ్ల ముందు ఉంచి బైక్‌లను తగులబెట్టడంతో టెన్షన్ మొదలయ్యింది. కొన్ని ఇళ్లను ధ్వంసం చేసి నానా బీభత్సం సృష్టించారు. వెంటనే పోలీసులు రంగలోకి దిగి పరిస్థితిని అదుపులోక తెచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. పట్టణం మొత్తం యుద్ధ వాతావరణాన్ని తలపించింది.

ఆందోళనకారులు కొందరు పోలీసులపై రాళ్ల దాడి చేశారు. ఈ ఘర్షణలో పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. సున్నితమైన ప్రాంతాల్లో భారీగా పోలీసుల్ని మోహరించారు. రాళ్ల దాడిలో భైంసా డీఎస్పీ నరసింహారావు, పట్టణ సీఐ వేణుగోపాలరావు, ముథోల్‌ ఎస్సై అశోక్‌, కొందరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు.. అలాగే ఇరువర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.