యాప్నగరం

TET Exam Postpone: టెట్ పరీక్ష వాయిదా..? మంత్రి సబితకు కేటీఆర్ అభ్యర్థన!

TET Exam Postpone | తెలంగాణలో టెట్ పరీక్ష వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. జూన్ 12న టెట్ నిర్వహించనుండగా.. అదే రోజున రైల్వే పరీక్ష కూడా ఉండటంతో.. టెట్ వాయిదా వేయాలని కోరుతూ ఓ వ్యక్తి మంత్రి కేటీఆర్‌ను కోరారు. దానికి స్పందించిన కేటీఆర్.. ఆ రిక్వెస్ట్‌ను పరిశీలించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. దీంతో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ మరో తేదీకి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Authored byరవి కుమార్ | Samayam Telugu 21 May 2022, 3:38 pm

ప్రధానాంశాలు:

  • జూన్ 12న తెలంగాణలో టెట్ పరీక్ష
  • అదే రోజు ఆర్ఆర్‌బీ ఎగ్జామ్
  • దీంతో టెట్ వాయిదా వేయాలని కోరుతున్న అభ్యర్థులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu exam | Representative Image
TET Exam likely to be postponed in Telangana
టెట్ ఎగ్జామ్ వాయిదా వేయడం కుదరదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తేల్చి చెప్పారు. దాదాపు 3.5 లక్షల మంది టెట్ పరీక్షలు రాయబోతున్నారన్న ఆమె.. మరే ఇతర కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌తో ఇబ్బంది లేకుండా రాష్ట్రంలో పరీక్షల నిర్వహణకు ప్లాన్ చేశామని ఆమె తెలిపారు. ఇతర పోటీ పరీక్షలతో కోయిన్స్‌డెన్స్ లేకుండా అన్ని పరీక్షల తేదీలను చాలా జాగ్రత్తగా ఎంపిక చేశామన్నారు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొని టెట్ పరీక్షలను వాయిదా వేయడం కుదరదని ఆమె తెలిపారు. ఎగ్జామ్స్ వాయిదా వేస్తే దాని ప్రభావం వేరే వాటిపై పడుతుందన్నారు.
జూన్ 12న టెట్ ఎగ్జామ్‌ జరగనుంది. పరీక్ష తేదీని తెలంగాణ ప్రభుత్వం మార్చి నెలలోనే ప్రకటించింది. కానీ అదే రోజున రైల్వే ఆర్‌ఆర్‌బీ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఒకే రోజు రెండు పరీక్షలు వస్తుండటంతో.. అభ్యర్థుల్లో కంగారు మొదలైంది. ఆర్‌ఆర్‌బీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తుండటంతో.. టెట్‌ను వాయిదా వేయాలని కోరుతూ ఓ అభ్యర్థి ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్‌ను కోరారు.

దీనికి స్పందించిన కేటీఆర్.. ఈ అభ్యర్థనను పరిశీలించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. కేటీఆర్‌ ట్వీట్‌‌కు స్పందిస్తూ.. విద్యాశాఖ మంత్రి పై విధంగా బదులిచ్చారు. అంతకు ముందు టెట్ కన్వీనర్ రాధారెడ్డి సైతం టెట్ ఎగ్జామ్ వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేశారు. పరీక్ష షెడ్యూల్‌ను మార్చిలోనే ప్రకటించామని తెలిపారు. జూన్ 6 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.
టెట్ పరీక్ష నిర్వహణ కోసం ప్రభుత్వం పరీక్ష కేంద్రాలను సైతం ఖరారు చేసింది. పేపర్ 1 కోసం 1480 సెంటర్లు, పేపర్ 2 కోసం 1171 సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఐదేళ్ల తర్వాత టెట్ నిర్వహిస్తుండటంతో.. బీఈడీ అభ్యర్థులు పేపర్‌ 1 రాసేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టెట్ ఎగ్జామ్ కోసం మొత్తం 6.29 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు.

Update:
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.