యాప్నగరం

ఎల్బీ స్టేడియంలో చోరీ.. తాళం పగలగొట్టి, ఫుట్‌బాల్ ట్రోఫీలు ఎత్తుకెళ్లి..

LB Stadium: కరోనా ప్రభావంతో గత నెలలో అసోసియేషన్ సెక్రటరీ ఫుట్‌బాల్ కార్యాలయానికి తాళం వేసి వెళ్లారు. ఆ తర్వాత 20 రోజుల తర్వాత మంగళవారం కార్యాలయానికి వెళ్లగా తాళం పగలగొట్టి ఉంది.

Samayam Telugu 18 Aug 2020, 5:24 pm
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో దొంగతనం జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ కార్యాలయంలో ఉంచిన ట్రోఫీలు మాయం కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం కరోనా ప్రభావంతో గత నెలలో అసోసియేషన్ సెక్రటరీ ఫుట్‌బాల్ కార్యాలయానికి తాళం వేసి వెళ్లారు. ఆ తర్వాత 20 రోజుల తర్వాత మంగళవారం కార్యాలయానికి వెళ్లగా తాళం పగలగొట్టి ఉంది. దీంతో సెక్రటరీ చోరీ జరిగిందని అనుమానించారు.
Samayam Telugu ఎల్బీ స్టేడియం (ఫైల్ ఫోటో)
Lal Bahadur Shastri Stadium


లోపలికి వెళ్లి చూడగా ట్రోఫీలు ఉన్న అల్మారా ధ్వంసం చేసి ఉంది. అందులో ఉన్న ట్రోఫీల్లో ఒకటి వెండితో చేసినది ఉంది. మరో 15 ఇత్తడి ట్రోఫీలు కూడా కనిపించడం లేదు. దీంతో సెక్రటరీ సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.