యాప్నగరం

Kalvakuntla Kavitha: ఈడీ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత.. ఆమె రోజువారీ దినచర్య ఇదే..

ఢిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న కల్వకుంట్ల కవిత.. పుస్తక పఠనం, భగవన్నామస్మరణతో తన దినచర్యను కొనసాగిస్తున్నారు. ఏకాదశి సందర్భంగా బుధవారం ధ్యానం చేస్తూ ఉపవాస దీక్షలో ఉన్నారు. ఇవాళ తల్లి శోభ కవితను కలిసే ఛాన్స్ ఉంది.

Authored byసందీప్ పూల | Samayam Telugu 21 Mar 2024, 10:29 am

ప్రధానాంశాలు:

  • ఈడీ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత
  • ఆమె రోజువారీ దినచర్య ఇదే
  • నేడు కలవనున్న తల్లి శోభ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Kalvakuntla Kavitha Case
ఈడీ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత.. ఆమె రోజువారీ దినచర్య ఇదే..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆమెకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు 7 రోజుల కస్టడీ విధించగా.. ప్రస్తుతం ఆమె ఈడీ కస్టడీలో ఉన్నారు. భగవద్గీత, పుస్తక పఠనం, భగవన్నామస్మరణతో కవిత తన దినచర్యను కొనసాగిస్తున్నారు. బుధవారం (మార్చి 20) ఏకాదశి సందర్భంగా ధ్యానం చేస్తూ ఉపవాస దీక్షలో ఉన్నారు. ఆమె కోరిక మేరకు ఈడీ అధికారులు పలు రకాల పండ్లను కవితకు అందించారు.
స్వామి సర్వప్రియానంద రాసిన భగవద్గీత, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జీవిత గాథ, ఏఎస్ పన్నీర్ సెల్వం రాసిన 'కరుణా నిధి – ఏ లైఫ్', శోభన కే నాయర్ రాసిన 'రాం విలాస్ పాశ్వాన్ – -ది వెదర్వాన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్' పుస్తకాలను ఆమె అడిగి తెప్పించుకున్నారు. రోజువారీ దినచర్యలో భాగంగా కవిత ఆ పుస్తకాలను చదువుతున్నారు. పుస్తకాల్లో చదివిన అంశాలను డైరీలో నోట్ చేసుకుంటున్నారు.

ఈడీ కస్టడీలో నాలుగో రోజూ కవిత విచారణ కొనసాగింది. కవిత సహాయకులు రాజేశ్‌, రోహిత్‌రావులను ఈడీ బుధవారం ప్రశ్నించింది. ఆమెను అరెస్టు చేసిన రోజు వీరిద్దరి ఫోన్లను సీజ్‌ చేసిన ఈడీ.. వాటిని వారి ముందే తెరిచి, వాటిలోని వివరాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. ఇద్దర్నీ సాక్షులుగా పరిగణిస్తూ నోటీసులు పంపడంతో విచారణకు హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వీరి విచారణ కొనసాగింది. మరోవైపు, ఈడీ కార్యాలయంలో ఆమెను సోదరుడు కేటీఆర్‌, న్యాయవాది మోహిత్‌రావు కలిశారు. ఇవాళ ఆమె తల్లి శోభ కలువనున్నట్లు తెలిసింది.

ఇక మద్యం కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో కవిత ఈ నెల 18న దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ శుక్రవారం (మార్చి 21న) జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేష్‌, జస్టిస్‌ బేలా ఎం. త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రానుంది. ఈమేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ లిస్ట్‌ చేసింది.
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.