యాప్నగరం

పెద్దపులి ఎలా వేటాడుతుందో చూస్తారా?

పెద్ద పులి వేటాడటాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? ఇదిగో ఈ వీడియోలో చూడండి. మట్టి కుప్పల్లో దాగిన పులి.. పశువుల మందపై ఒక్కసారిగా దాడికి యత్నించింది. దీంతో పశువులన్నీ అరుస్తూ పరిగెత్తాయి.

Samayam Telugu 22 May 2020, 12:55 pm
హైదరాబాద్ శివార్లలో చిరుత పులి సంచారం నగరవాసులను భయపెట్టగా.. ఆసిఫాబాద్ జిల్లా వాసులను పెద్దపులి భయపెడుతోంది. గత మూడు వారాలుగా తిర్యాణి, ఆసిఫాబాద్ మండలాల్లో పెద్దపులి సంచరిస్తోంది. ఖైరిగూడలోని సింగరేణి కార్మికులకు తరచుగా పెద్దపులి కనిపిస్తుండటంతో వారు కలవరానికి గురవుతున్నారు. పది రోజుల క్రితం వాగులో నుంచి దర్జాగా నడుచుకుంటూ వెళ్లిన పులి తాజాగా మట్టికుప్పల్లో కనిపించింది.
Samayam Telugu asifabad tiger


అటుగా వచ్చిన పశువుల మీదకు పెద్ద పులి దాడికి యత్నించగా.. అవి అరుస్తూ పరిగెత్తాయి. ఓపెన్ కాస్ట్ గనుల్లో మట్టి తవ్వకాలు చేపడుతున్న కార్మికులు వాహనంలో వెళ్తుండగా వారికి ఈ దృశ్యం కంటపడింది. పెద్దపులిని గమనించగానే.. వారు వాహనాన్ని నిలిపేసి.. తమ ఫోన్లో వీడియో చిత్రీకరించారు.

గతంలో ఆసిఫాబాద్, చిర్రకుంట, కుంపల్లి అటవీ ప్రాంతాల్లో మేతకు వెళ్లిన పశువులపై పులి దాడి చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్రలోని తిప్పేశ్వరం అటవీప్రాంతం నుంచి ఆడతోడు కోసం మగపులి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి వచ్చిందని అధికారులు భావిస్తున్నారు. అదే నిజమైతే ఈ ప్రాంతంలో రెండు పులులు ఉన్నట్లే. సింగరేణి గనుల వల్ల ప్రశాంతత దెబ్బతినడంతో పులులు ఇక్కడ నిర్ధిష్టమైన ఆవాసాన్ని ఏర్పాటు చేసుకోలేకపోతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.